తెలంగాణ, సామాజిక స్పందన
జర్నలిస్టుల సంక్షేమం, రక్షణ కొరకు స్థాపించిన "నేషనల్ యాక్టివ్ రిపోర్టర్స్ అసోసియేషన్" జర్నలిస్టుల కుటుంబాల్లో కొత్త వెలుగులు నింపటానికి జాతీయ స్థాయిలో అవిశ్రాంత పోరాటం చేస్తూ అనతికాలంలోనే భారతదేశంలో అత్యధిక సభ్యులు కలిగి జర్నలిస్టుల గుండెచప్పుడు గా అగ్రభాగంలో నిలిచింది.
పాత్రికేయుల శ్రేయస్సు కోసం ఎక్కని మెట్టు లేదు, తొక్కని గడప లేదు, మొక్కని దైవం లేదు, చివరికి ఎదుర్కోని అవమానమూ లేదు. అయినా ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్లి జర్నలిస్టులకు ఒక ఆశాకిరణంగా చిరస్థాయిగా నిలిచిపోయింది "నేషనల్ యాక్టివ్ రిపోర్టర్స్ అసోసియేషన్"
భారతదేశంలో (ఎన్.ఏ.ఆర్.ఏ) NARA - నేషనల్ యాక్టివ్ రిపోర్టర్స్ అసోసియేషన్ అంటే తెలవని ప్రజాప్రతినిధులు గానీ, అధికారులు గాని ఎవరూ లేరు. పాత్రికేయుల శ్రేయస్సు కోసం "నేషనల్ యాక్టివ్ రిపోర్టర్స్ అసోసియేషన్" తట్టని తలుపు లేదు. ప్రభుత్వ కార్యాలయాల్లో బెంచ్ క్లర్క్ దగ్గరనుంచి ఎమ్మెల్యే , ఎంపి, మినిస్టర్ లను కలుపుకుని ముఖ్యమంత్రులు, రాష్టప్రతి వరకూ జర్నలిస్ట్ సమస్యలను వారికి విన్నపించి నివేదన చేసింది బండి సురేంద్రబాబు సారథ్యంలోని నేషనల్ యాక్టివ్ రిపోర్టర్స్ అసోసియేషన్ మాత్రమే.
ఎన్.ఎ.ఆర్.ఎ ఆవిర్భావం నుంచి జర్నలిస్టుల కి దీర్ఘకాలిక ప్రయోజనాలే ముఖ్య లక్ష్యంగా కృషి చేస్తూ వస్తుంది. జర్నలిస్టులు ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి జర్నలిస్టు కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని, జర్నలిస్టుల పై దాడులు అరికట్టడానికి జర్నలిస్టుల రక్షణ కోసం కఠిన చట్టాలు కావాలని అనే ప్రధాన డిమాండ్ల తో గల్లీ నుంచి ఢిల్లీ వరకూ ప్రజా ప్రతినిధులను, ఉన్నత అధికారులను కలిసి జర్నలిస్టుల హక్కుల సాధన కోసం అలుపెరగని పోరాటం చేసింది "నేషనల్ యాక్టివ్ రిపోర్టర్స్ అసోసియేషన్".. జర్నలిజం మూలాలను బ్రతికించి, జర్నలిస్టుల విలువను పెంచడానికి "నేషనల్ యాక్టివ్ రిపోర్టర్స్ అసోసియేషన్" అత్యధిక ప్రాధాన్యత ఇచ్చింది.. ఒకవైపు జర్నలిస్టుల సమస్యలపై జాతీయస్థాయిలో అలుపెరుగని పోరాటం చేస్తూ కూడా, ప్రకృతి వైపరీత్యాలు, కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో సమాజ సేవలో "నేషనల్ యాక్టివ్ రిపోర్టర్స్ అసోసియేషన్" ప్రధాన భూమిక పోషించింది.
పాత్రికేయుల రక్షణ కొరకు చట్టాలను కఠినతరం చేయకపోతే ' మరో - స్వాతంత్రపోరాటమే ' అని జర్నలిస్టుకు అండగా నిలిచింది నేషనల్ యాక్టివ్ రిపోర్టర్స్ అసోసియేషన్.
రాజకీయ పార్టీల కు అతీతంగా కలం కట్టుబాట్లు మాత్రమే పరమావధి గా అలుపెరుగని ప్రయాణం చేస్తూ విమర్శకుల తో సైతం జేజేలు పలికిస్తూ… ఎదురైన ప్రతి ‘అసహన – సన్నివేశాల ‘ నీ తమ ప్రయాణానికి నూతన ఉత్సాహ బాటలుగా నిర్మితం చేసుకుంటూ అహర్నిశలూ ప్రయాణాన్ని కొనసాగిస్తుంది నేషనల్ యాక్టివ్ రిపోర్టర్స్ అసోసియేషన్. జర్నలిస్ట్ లకు న్యాయం జరిగేంత వరకూ వారి ఆవేదన లను "ఎన్.ఎ.ఆర్.ఎ" వ్యవస్థాపక అధ్యక్షులు సురేంద్రబాబు ఎప్పుడూ ముక్త కంఠంతో ఘోషిస్తూనే ఉన్నారు..
జర్నలిస్టుల సంక్షేమం రక్షణ ముఖ్య లక్ష్యంగా "వార్తా ప్రపంచం" దినపత్రిక చీఫ్ ఎడిటర్ బండి సురేంద్ర బాబు ఆధ్వర్యంలో "నేషనల్ యాక్టివ్ రిపోర్టర్స్" అసోసియేషన్ ఆవిర్భవించింది. ఎన్.ఎ.ఆర్.ఎ. వ్యవస్థాపకులు బండి సురేంద్రబాబు సీనియర్ జర్నలిస్టు మాత్రమే కాకుండా స్వతహాగా సామాజిక సేవా కార్యకర్త కావడం వల్ల వివిధ జాతీయ విపత్తుల్లో స్పందించిన మాదిరిగానే కరోనా సమయంలో కూడా తన ఉదారతను చాటుకున్నారు. హుద్‌హుద్, తితిలీ, కేరళ ప్రకృతి విపత్తుల సమయంలో నేషనల్ యాక్టివ్ రిపోర్టర్స్ అసోసియేషన్ నాయకులు స్వయంగా బాధితులను ఆదుకునేందుకు క్షేత్రస్థాయిలో పర్యటించిన సందర్భాలు ఉన్నాయి. తన బృందాలను సహాయక కార్యక్రమాల విషయంలో సమాయత్తం చేస్తూ వారికి కావాల్సిన ఆర్ధిక వనరులను సమకూర్చడమే కాకుండా నేరుగా నేషనల్ యాక్టివ్ రిపోర్టర్స్ అసోసియేషన్ నాయకులు సేవా కార్యక్రమాలలో పాల్గొన్నారు. జర్నలిస్టులు వార్తలు రాయడమే కాకుండా ఇలాంటి సేవలు కూడా చేస్తారా? అనేటట్లు నేషనల్ యాక్టివ్ రిపోర్టర్స్ అసోసియేషన్ వివిధ సందర్భాలలో సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహించారు. వేసవిలో చలివేంద్రాలను విస్తృతంగా ఏర్పాటుచేసి దాహార్తిని తీర్చడంలోను, అన్నదాన కార్యక్రమాలను, మెడికల్ క్యాంపు నిర్వహించడం లోను నేషనల్ యాక్టివ్ రిపోర్టర్స్ అసోసియేషన్ ఎప్పుడూ ముందుంటుంది.
‘అభద్రత‘ లో ఉన్న రంగం కేవలం ఒక్క 'పాత్రికేయం' మాత్రమే. అందుకే పాత్రికేయ రంగం లో ఉన్నటువంటి ఈ అభద్రతా భావం నుండి నిజమైన పాత్రికేయ మిత్రులను సంరక్షించి వారికి ఓ సరైన మార్గాన్ని నిర్దేశించి దాని కొరకు అహర్నిశలూ ఎవరు గుర్తించినా - గుర్తించకపోయినా నేషనల్ యాక్టివ్ రిపోర్టర్స్ అసోసియేషన్ తన పని తాను చేసుకుంటూ పోతుంది.
నేషనల్ యాక్టివ్ రిపోర్టర్స్ అసోసియేషన్ స్థాపించి ఈనెల అక్టోబర్ 26 తో దిగ్విజయంగా 6 వసంతాలు పూర్తిచేసుకుని 7వ వార్షికోత్సవం లోకి అడుగు పెడుతున్నది...
ఈ సందర్భంగా ఫౌండర్ మరియు నేషనల్ ప్రెసిడెంట్ డాక్టర్ బండి సురేంద్రబాబు మాట్లాడుతూ నేను, నాతోటి నాయకులు అందరం కలిసి మాకు ఉన్న తక్కువ ఒనరలతో, తక్కువ సమయంలో ఎన్నో ఒడిదిగులు ఎదుర్కొని, ఈ రోజు కొన్ని వేల మంది సభ్యులతో దేశం లోనే జర్నలిస్టులకు ఒక ప్రత్యామ్నాయం నేషనల్ యాక్టీవ్ రిపోర్టర్స్ అసోసియేషన్ నే అనుకునేటట్లు చేయడం లో సఫలీకృతం అయ్యాము అని సగౌర్వంగా ప్రకటిస్తున్నామన్నారు...
జర్నలిస్టుల మీద జరుగుతున్న దాడులు, జర్నలిస్ట్ కార్పొరేషన్ ఏర్పాటు, జర్నలిస్ట్ పిల్లలకు ప్రైవేట్ పాఠశాలలో, కాలేజీలలో ఉచిత విద్య, అక్రిడిటేషన్ సమస్యలు, జర్నలిస్టుల ఇళ్ల సమస్యలు వంటి అనేక రకాల జర్నలిస్టుల సమస్యలను జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో ప్రజాప్రతినిధులను, అధికారులు ను కలసి వివరించి సమస్యలు పరిష్కారం అవ్వడంలో మా వంతు పాత్ర మేము నిర్వహించాము... కేంద్ర, రాష్ట్ర, జిల్లా పరిధిలోని నాయకులు, మీ పరిధిలోని జర్నలిస్టుల సమస్యలపై ఉన్నతాధికారులను, ప్రజాప్రతినిధులను కలసి మన జర్నలిస్ట్ సమస్యలను పరిష్కరించే దిశగా కార్యసాధనలో ముందుండి మన అసోసియేషన్ కి మంచి గుర్తింపు తీసుకవస్తారని ఆశిస్తున్నానన్నారు.. అన్నదమ్ముళ్లగా కలసి మెలసి ఐకమత్యంతో జర్నలిస్టుల సమస్యల సాధన కోసం పోరాడి జర్నలిస్టుల జీవితాల్లో కొత్త వెలుగులు నింపడానికి సహకరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేషనల్ యాక్టివ్ రిపోర్టర్స్ అసోసియేషన్ కుటుంబ సభ్యులందరికీ 7వ వార్షికోత్సవ శుభాకాంక్షలు సురేంద్రబాబు తెలియజేశారు...










0 Comments