సామాజిక స్పందన, పెద్దాపురం, కాకినాడ జిల్లా
6 నెలలుగా కార్మికులను బయటపడేసిన పట్టాభి ఆగ్రోపుడ్స్ (సైరస్) లో విషయంలో అధికారులు జోక్యం చేసుకొని కార్మికులను తక్షణం విదుల్లోకి తీసుకోవాలనే విధంగా చెయ్యాలని కోరుతూ పెద్దాపురం రెవిన్యూ డివిజనల్ అధికారికి పట్టాభి ఆగ్రోపుడ్స్ కార్మికులు వినతిపత్రం అందజేసారు. పట్టాభిలో డ్రైవర్స్ గా పని చేస్తున్న తమను బయటకు నెట్టేసి 6నెలలు అవుతున్నా యాజమాన్యం పట్టించుకోవడం లేదని అన్నారు. కార్మికులను మేము తొలగించలేదని యాజమాన్యం చెబుతుందని, అలాంటప్పుడు విధుల్లో పెట్టుకోవడానికి అడ్డు ఏముంటుందని యాజమాన్యం ఆలోచించే విధంగా అధికారులు అడగాలని కోరారు. కార్మికులకు పిఎఫ్ కట్టడం లేదని అడిగితే కార్మికులను తొలగించడం అన్యాయమన్నారు. పక్క కంపెనీ వారి వల్లనే మేము కార్మికులను విధుల్లో పెట్టుకోవడం లేదని కంపెనీ చెప్పడం చాలా హాస్యస్పదమే అని అన్నారు. తక్షణం ప్రభుత్వ అధికారులు కలుగజేసుకొని కంపెనీలోకి కార్మికులను విధుల్లోకి తీసుకునే విధంగా చెయ్యాలన్నారు. దీనిపైన స్పందించిన ఆర్.డి వో కార్మిక శాఖ కార్యాలయం వారితో మాట్లాడి సమావేశం వెయ్యమని చెబుతామని తెలిపారు. సిఐటియు నాయకులు సిరిపురపు శ్రీనివాసరావు, ప్రైవేట్ ఎలక్ట్రికల్ వర్కర్స్ యూనియన్ గౌరవాధ్యక్షులు చింతల సత్యనారాయణ, అప్పారావు, శివ, వరప్రసాద్, శ్రీను, యెాహాన్, రమేష్, బి.రమేష్, బాలరాజు తదితరులు పాల్గోన్నారు.
@@@@@@ మరిన్ని వార్తలు @@@@@@
సామాజిక స్పందన, కాకినాడ జిల్లా
భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు పున:రుద్దణకై,పెండింగ్ క్రైములు పరిహారల సాధనకే జరిగే నవంబర్ 7 చలో కాకినాడ కలెక్టరేట్ ను జయప్రదం పై ఏపీ బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ సిఐటియు కాకినాడ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో తునిలో ప్రారంభమైన ప్రచార జాత పెద్దాపురం చేరుకుంది. ఈ జాతాకు పెద్దాపురం కొత్తపేట పెట్రోల్ బంక్ సెంటర్ లో స్వాగతం పలికారు. ఈ జాతాను ఉద్దేశించి ఏపీ బిల్డింగ్ & అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ,వర్కింగ్ ప్రెసిడెంట్ నెట్ల శ్రీను,రొంగల ఈశ్వరరావు ,చెక్కల రాజకుమార్ లు మాట్లాడుతూ 2009లో జగన్మోహన్ రెడ్డి గారు తండ్రిగారైన దివంగనేత వైయస్ రాజశేఖర్ రెడ్డి గారు అధికారంలో ఉండగా సంక్షేమ బోర్డు పోరాడి సాధించడం జరిగిందని ,ఇది జీవో కాదని చట్టం అని ఈ చట్టాన్ని రద్దు చేయడం ఎవరి వల్ల కాదని అన్నారు. కానీ జగన్ మోహన్ రెడ్డి గారు 1214 మెమోను తీసుకువచ్చి పథకాలు నిలుపుదల చేసి సంక్షేమ బోర్డులో ఉన్న 2000 కోట్ల రూపాయలు తమ ప్రభుత్వ సొంత పధకాలకు మలుచుకుని భవన నిర్మాణ కార్మికులకు చెందవల్సిన సంక్షేమ పథకాలకు నిలుపుదల చేశారని వారన్నారు .గత మూడు సంవత్సరాల నుండి పెండింగ్ లో పెట్టిన పరిహారాలను కార్మికులకు తక్షణమే చెల్లించాలని , 2020 ఆగస్టు నుండి ఈనాటి వరకు జరిగిన వివాహాలకు, ప్రసవాలకు, సహజ, ప్రమాద మరణాలకు పరిహారాలను సంక్షేమ బోర్డు ద్వారా చెల్లించాలని వారు అన్నారు. అలాగే అర్హులైన భవన నిర్మాణ కార్మికులందరికీ వృద్ధాప్య వితంతు వికలాంగ్ పెన్షన్లు ఇరత రాష్ట్రలు ఇస్తున్నట్లు ఈ సంక్షేమ బోర్డు ద్వారా ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ తో సంబంధం లేకుండా భవన నిర్మాణ కార్మికుల పోగు చేసుకున్న ఈ నిధులను కార్మికుల సంక్షేమానికి ఖర్చు చేయాలని అన్నారు. కార్మికులకు ఉపయోగపడే బోర్డుని ఈరోజు నిలుపుదల చేసి భవన నిర్మాణ కార్మికులకు తీరని అన్యాయం ఈ జగన్ ప్రభుత్వం చేసిందని ఈ సందర్భంగా ఎద్దవ చేశారు. అలాగే ప్రతి గ్రామంలో భవన నిర్మాణ కార్మికుల సంఘాలకు యొక్క సొంత భవన నిర్మాణానికి ఐదు సెంట్లు స్థలాన్ని, 5 లక్షల ప్రభుత్వ గ్రాంటు మంజూరు చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. కావున ఈ సమస్యలు పరిష్కారం కై సంక్షేమ పథకాలు పునరుద్ధరణకై, పరిహారాలకై నవంబర్ 7న ఛలో కాకినాడకు వేలాదిక తరలిరావాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. జాత ఈనెల 31 వరకు జిల్లా అంతా తిరిగి భవన నిర్మాణ కార్మికులను రాష్ట్ర ప్రభుత్వం చేసిన అన్యాయాన్ని వివరిస్తూ భవనిర్మాణ కార్మికులను ఏకం చేయడం జరుగుతుందని సందర్భంగా వారు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కావున పెద్దాపురం మండలంలో ఉన్న భవన నిర్మాణ కార్మికులు ఛలో కలెక్టరేట్ కి సిద్ధమై వేలాదిగా తరలి వచ్చి మన సంక్షేమ బోర్డును కాపాడుకోవాలని పిలుపున్నిచ్చారు. ఈకార్యక్రమంలో మండల సిఐటియు నాయకులు డి.క్రాంతి కుమార్, బిల్డింగ్ వర్కర్స్ అధ్యక్షులు గడిగట్ల సత్తిబాబు, కంచుమర్తి కాటంరాజు, మరిడమ్మతల్లి పెయింటింగ్ యూనియన్ కార్యదర్శి గూనురి రమణ, ఆనూరు భవన నిర్మాణ కార్మిక సంఘం నాయకులు గంగాధర్, చంద్రమాంపల్లి నాయకుల మాగాపు నాగు, రేలంగి వెంకట్రావు, పెదబాబు, రమేష్ తదితరులు పాల్గోన్నారు..











0 Comments