కలలో కూడా కేసీఆర్ కు హాని చేసే వ్యక్తిని కాదు: రఘురామకృష్ణంరాజు


హైదరాబాద్, సామాజిక స్పందన

 నిన్న సాయంత్రం తనకు సిట్  అదికారులు నోటీసులు  ఇచ్చారని, ఢిల్లీ లో ఉన్న నివాసానికి కూడా నోటీసు పంపించారని ఎంపీ రఘురామకృష్ణంరాజు  చెప్పారు.శుక్రవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ ఈనెల 29వ తేదీ ఉదయం 10.30 గంటలకు హాజరు కావాలని తెలంగాణ సిట్ నోటీసులు ఇచ్చిందని పేర్కొన్నారు. ప్రజా జీవితంలో ఉన్నాను కాబట్టి ఎవరితోనైనా ఫోటోలు దిగాల్సి ఉంటుందన్నారు. జగన్మోహన్ రెడ్డి (CM Jagan) 32 కేసుల్లో 420గా ఉన్నారని, ఆయనతో ఫోటోలో 151 మంది ఎమ్మెల్యేలు ఉంటారని, ఉన్నంత మాత్రాన అందరూ నేరాస్థులు కాలేరని అన్నారు. తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తాను ఎప్పుడు మాట్లాడలేదని, తెలంగాణ ప్రభుత్వ పనితీరు బాగుందని చాలా సందర్బల్లో చెప్పానని, కలలో కూడా సీఎం కేసీఆర్‌ (CM KCR)కు హాని చేసే వ్యక్తిని కాదని, కేసీఆర్ ఒక మంచి పాలకుడని రఘురామ కొనియాడారు.

తాను హైద్రారాబాద్‌లో ఒక సెటిలర్‌నని, తనలాంటి వారు చాలా మంది ఉన్నారని రఘురామ వ్యాఖ్యానించారు. రూ.వంద కోట్లు అంటూ సాక్షిలో తనపై దుష్ప్రచారం జరుగుతోందన్నారు. సిట్‌ ఇచ్చిన నోటీసులకు హాజరవుతాని, సీఎం జగన్ నీలి నీడ తనపై పడకుండా చూసుకుంటానని రఘురామ అన్నారు. వ్యవస్థలను జగన్ ఎలా శాశిస్తున్నారో ప్రజలు అర్ధం చేసుకోవాలన్నారు. కిషన్ రెడ్డి, నంద కుమార్ ఫోటోలు కూడా ఉన్నాయి... ఉంటే కిషన్ రెడ్డికి కూడా నోటీసులు ఇస్తారా? అని రఘురామ ప్రశ్నించారు.


@@@@@@ మరిన్ని వార్తలు @@@@@@@


వ్యవసాయం, ధాన్యం సేకరణపై సీఎం వైఎస్ జగన్ సమీక్ష


తాడేపల్లి, ఏపీ, సామాజిక స్పందన

 వ్యవసాయం, ధాన్యం సేకరణపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి క్యాంపు కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు.ఈ సమావేశానికి మంత్రులు కాకాణి గోవర్థన్‌రెడ్డి, కారుమూరి నాగేశ్వరరావు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, ఎంఎస్‌పీ కన్నా తక్కువ ధరకు అమ్ముకోవాల్సి వచ్చిందనే మాట ఎక్కడా రాకూడదని, దీన్ని అధికారులు సవాల్‌గా తీసుకోవాలన్నారు.''ధాన్యం కొనుగోలులో మిల్లర్ల పాత్ర తీసివేస్తున్నాం. రైతులకు గరిష్ట ప్రయోజనాలు అందించేలా ధాన్యం సేకరణ కొనసాగాలి. ఇ-క్రాపింగ్‌ డేటాను వాడుకుని అత్యంత పటిష్ట విధానంలో సేకరణ కొనసాగాలి. వ్యవసాయ శాఖతో పౌరసరఫాల శాఖ అనుసంధానమై రైతులకు మంచి జరిగేలా తగిన చర్యలు తీసుకోవాలి. రబీకి అన్నిరకాలుగా సిద్ధంగా ఉండాలని అధికారులకు సీఎం ఆదేశించారు.

ఎరువులు, విత్తనాలు, ఇలా అన్నిరకాలుగా రైతులకు కావాల్సివన్నీ సిద్ధం చేసుకోవాలన్న సీఎం.. ప్రతి ఆర్బీకేలో ఒక డ్రోన్‌ను ఉంచేలా కార్యాచరణ సిద్ధంచేయాలన్నారు. వచ్చే రెండేళ్లలో అన్ని ఆర్బీకేల్లోనూ డ్రోన్స్ ఉండేలా చూడాలని సీఎం అన్నారు..


@@@@@ @@ మరిన్ని వార్తలు @@@@@@@@

 


కడప జిల్లాలో వందల కోట్లు విలువైన 34 ఎకరాల 83 సెంట్లు ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించారా ?


అమరావతి, సామాజిక స్పందన

కడప జిల్లాలో వందల కోట్ల రూపాయల విలువైన 34 ఎకరాల 83 సెంట్లు ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించారంటూ కడప జిల్లా చిమ్మినిపేటకు చెందిన మార్కాపురం మురళీకృష్ణ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాన్ని సోమవారం ప్రధాన న్యాయమూర్తి ప్రశాంత్ కుమార్ మిశ్రా, డిబిబిఎస్ సోమయాజుల ధర్మాసనం విచారించింది. ప్రభుత్వ స్థలాన్ని రాజకీయ నాయకుల ప్రోత్బలంతో ఆక్రమించి భవనాలు నిర్మిస్తున్నారంటూ న్యాయవాది జడ శ్రావణ్ కుమార్ వాదనలు వినిపించారు.

ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టం ప్రకారం చెరువులు ఆక్రమించడం చట్టరీత్యా నేరమని శ్రవణ్ కుమార్ ధర్మాసనానికి నివేదించారు. ఏపీ ప్రిన్సిపల్ సెక్రటరీ, జిల్లా కలెక్టర్ తక్షణమే ఆక్రమణల మీద చర్యలు తీసుకోవాల్సిందిగా ధర్మాసనం ఆదేశించింది. రెండు నెలల్లో విచారణ ప్రక్రియ పూర్తి చేసి పూర్తిస్థాయిలో ఆక్రమణలు ఉంటే వాటిని తొలగించి భూములు స్వాధీనం చేసుకోవాలని ధర్మాసనం ప్రభుత్వానికి ఆదేశాలు ఇస్తూ విచారణ ముగించింది.

Post a Comment

0 Comments

Latest News

Powered by Blogger.

Admin

Admin
Content published by Samajika Spandana.