మా పై రాజకీయ వేధింపులు ఆపాలి అంటున్న అంగన్ వాడీ వర్కర్స్

 


సామాజిక స్పందన, పెద్దాపురం పట్టణం

అంగన్ వాడీ వర్కర్లపై రాజకీయ వేధింపులు ఆపాలని ఎ.పి అంగన్ వాడీ వర్కర్స్ & హెల్పర్స్ యూనియన్(సిఐటియు) జిల్లా ప్రధాన కార్యదర్శి ఇ.చంద్రవతి డిమాండ్ చేసారు. సంఘం పెద్దాపురం ప్రాజెక్ట్ మహాసభ స్ధానిక యాసలపు సూర్యారావు భవన్ లో పుప్పాల సావిత్రి అధ్యక్షతన మహాసభ జరిగింది. ఈ మహాసభకి ముఖ్యఅతిదిగా చంద్రావతి పాల్గోని ప్రసంగించారు. అంగన్ వాడీ వర్కర్ లపై పెత్తనం విపరీతంగా పెరిగిందని అన్నారు. ప్రభుత్వం అంగన్ వాడీ వ్యవస్ధను నాశన చెయ్యడానికి నూతన విద్యావ్యవస్ధను తీసుకువచ్చిందని అన్నారు. తెలంగాణా ప్రభుత్వం కన్నా వెయ్యిరూపాయలు అదనంగా వేతనాలు ఇస్తామని చెప్పిన జగన్ మెాహన్ రెడ్డి వేతనాలు పెంపుదల చెయ్యడం లేదని అన్నారు. నిత్యవసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయని కానీ వర్కర్లకు, ఆయాలకు అవసరమైన వేతనాల పెంపుదల ఎందుకు చెయ్యడం లేదని ప్రశ్నించారు. సూపర్ వైజర్లను తీస్తున్నామని చెబుతూనే రాజకీయంగా డబ్బులు దండుకునే పని చేసారన్నారు. అంగన్ వాడీ వర్కర్ల సమస్యలను తక్షణం పరిష్కరించాలని డిమాండ్ చేసారు.


   మహాసభల నివేదికను సంఘం కార్యదర్శి దాడిబేబి ప్రవేశపెట్టారు. ప్రజానాట్యమండలి కళాకారులు డి.కృష్ణ, డి.సత్యనారాయణ, సిహెచ్. స్నేహలతలు అభ్యుదయ గీతాలను ఆలపించారు. సిఐటియు మండల అధ్యక్షులు గడిగట్ల సత్తిబాబు, డి.క్రాంతి కమార్, ఇ. ఉమామహేశ్వరి, వనకుమారి, టిఎల్.వి. నాగమణి, రత్నం, సుభారత్నం, కుమారి, మంగ, అన్నపూర్ణ, గంగరత్నం తదితరులు పాల్గోన్నారు.


@@@@@@@ మరిన్ని వార్తలు@@@@@@@@


పట్టాభి అగ్రోఫుడ్స్ లో తొలగించిన కార్మికులకు న్యాయం జరిగేది ఎప్పుడు ?


సామాజిక స్పందన, పెద్దాపురం పట్టణం

      పట్టాబి ఆగ్రోపుడ్స్ లో కార్మికులను తొలగిస్తూ వారంతా అప్ స్కాండ్ అయ్యారంటూ డిసిఎల్ కార్యాలయం చెప్పడం చాలా దుర్మార్గమని, అబద్దాలు మానుకోవాలని డిమాండ్ చేస్తూ పట్టాభి ఆగ్రోపుడ్స్ కంపెనీ గేటు ముందు కార్మికులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్బంగా దేవాబత్తుల రమేష్ మాట్లాడుతూ కంపెనీలో ఏప్రియల్ 20 తరువాత ఒక్కొక్కరిగా 20 మందిని తొలగించారని, కానీ కార్మికులందరూ అప్ స్కాండ్ అయ్యారంటూ చెప్పడం చాలా దుర్మార్గమన్నారు. తొలగించిన నాటి నుండి రోజు నాయకుల చుట్టూ, గేటు ముందు కనపడుతున్నా కంపెనీ యాజమాన్యానికి కనిపించడం లేదా అని ప్రశ్నించారు. కార్మికుల సమస్య పరిష్కరించడం మానేసి అబద్దాలు చెప్పడం ఏంటన్నారు. సిఐటియు నాయకులు డి.క్రాంతి కుమార్ మాట్లాడుతూ కంపెనీలల్లో 75 శాతం కార్మికులను స్ధానికులను తీసుకోవాలని ముఖ్యమంత్రి చెబుతుంటే స్ధానికులనే ఉద్యోగాల నుండి పట్టాభి ఆగ్రోపుడ్స్ యాజమాన్యం తొలగించేస్తుందన్నారు. స్దానిక నాయకులు దీనిపైన దృష్టి పెట్టాలని విజ్ఞప్తి చేసారు. తక్షణం ఉద్యోగాలలోకి కార్మికులను తీసుకునే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. 

ఈ కార్యక్రమంలో సిఐటియు మండల అధ్యక్షులు గడిగట్ల సత్తిబాబు, కె.అప్పన్న, డి.కృష్ణ, వడ్డి సత్యనారాయణ, శివ, పెంకే శ్రీను, వరప్రసాద్, బాలరాజు, జాన్, పెదబాబు తదితరులు పాల్గోన్నారు.

Post a Comment

0 Comments

Latest News

Powered by Blogger.

Admin

Admin
Content published by Samajika Spandana.