హైదరాబాద్, సామాజిక స్పందన
కార్తీకమాసం క్షత్రియ వన మహోస్తవం ఆదివారం నాడు హైదరాబాద్ లోని కీశర ప్రాంతంలో అట్టహాసంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ పరిసర ప్రాంతాల క్షత్రియులు అధిక మొత్తంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పిల్లలు,పెద్దలు, యువకులు ఆటల,పోటీలలో పాల్గొని బహుమతులు గెలుచుకున్నారు. ఈ కార్యక్రమం శ్రీ సూర్య యూత్ అసోసియేషన్ నిర్వహించడం జరిగింది.
శ్రీ సూర్య యూత్ అసోసియేషన్ 1998-99 లో సురేష్, దాట్ల సోమరాజు(వాసు),మోహన వర్మ, రాయపరాజు, యుగంధర్ రెడ్డి , మురళి గారు ,రమేష్ గారు, ఆర్టీసీ కృష్ణంరాజు గారు, సంజయ్ మొదలైన వారు మొట్టమొదటిగా దీన్ని మొదలుపెట్టడం జరిగింది.వారు మొదలుపెట్టిన పునాదిపై ఇప్పటి పెద్దలు శ్రీ పేరిచర్ల కృష్ణంరాజు గారు మౌలాలి హౌసింగ్ బోర్డ్ సెంటర్ నందు 2003 వ సంవత్సరం లో విప్లవ జ్యోతి శ్రీఅల్లూరి సీతారామరాజు గారి కాంస్య విగ్రహాన్ని నిర్మించడం జరిగింది. కాలక్రమములో కీర్తిశేషులు సోమ సుందర్ రాజు గారు, తాత రాజు గారు అసోసియేషన్ కార్యక్రమంలో చురుగ్గా పాల్గొన్నారు వారితోపాటు రామచంద్ర రాజు గారు, దాట్ల సత్యనారాయణ రాజు గారు, ఓంకార్ రాజు గారు,ఈసిఐఎల్ మూర్తి రాజు గారు, జయరామరాజు గారు,గోపాల రాజు గారు ,సత్యం గారు, మురళి గారు, మూర్తి రాజు గారు వారితో పాటు వీరంతా కలిసి అసోసియేషన్ కు మంచి పేరు తీసుకొచ్చారు.2010 వరకు అసోసియేషన్ చేసే కార్యక్రమాలకి దాతలు దగ్గర నుంచి విరాళాలు తీసుకుని కార్యక్రమాన్ని పూర్తి చేయడం జరిగింది. 2010-11లో గారు శ్రీ అల్లూరి రమణ రాజు గారు ఒక ఫండ్ క్రియేట్ చేసి అసోసియేషన్ను మంచి వృద్ధిలోకి తీసుకురావలనే సదుద్దేశంతో పెద్దలందరినీ కలుపుకుని భూపతి రాజు వెంకటేశ్వర రాజు గారు, మలక్పేట రాజు వర్మ గారు ఉప్పల ధర్మరాజు గారు,రాజు వర్మ గారు, బి ఎన్ పి రాజుగారు మరియు రమణ గారి ఫ్రెండ్స్ అందరూ కలిసి ఫండ్ ఏర్పాటు చేయడం జరిగింది. దాని మీద వచ్చే ఇంట్రెస్ట్ తో పాటు మిగతా అమౌంట్ దాతలు దగ్గర తీసుకొని ఇప్పటివరకు అన్నీ కార్యక్రమాలన్నీ విజయవంతంగా పూర్తి చేశారు.
అలాగే శ్రీ సూర్య యూత్ అసోసియేషన్ నందు పనిచేసిన సభ్యులు "ది క్షత్రియ సేవా సమితి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ" అసోసియేషన్ లో ప్రెసిడెంట్గా, మెంబర్లుగా, సెక్రెటరీగా, జాయింట్ సెక్రటరీలుగా సేవలందిస్తూ "ది క్షత్రియ సేవా సమితి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ" అసోసియేషన్ లో ఒక గుర్తింపును పొందుచున్నారు. దీనిలో నాగరాజు గారు, సత్యనారాయణ రాజు గారు, వీరభద్ర రాజు గారు, మధు వర్మ గారు ,రామకృష్ణ గారు, ఈసీఐఎల్ మూర్తి రాజు గారు, మూర్తి రాజు గారు, డి వి ఎస్ ఎస్ ఎన్ రాజుగారు మొదలైన వారు ఈ సూర్య అసోసియేషన్ నుంచి సేవలందిస్తున్నారు.
అదేవిదంగా ప్రస్తుతం సంస్థ చేసే కార్యక్రమాల్లో మేము ఉన్నామంటూ ఏ సమయానికి అయినా ముందుకొచ్చి సేవలందించే సభ్యులు శ్రీఅల్లూరి వాసు రాజు గారు,రమేష్ రాజు గారు, వాసు రాజుగారు, జగపతి రాజు గారు,డి.పి.ఎన్ రాజుగారు, పెద్ద బుజ్జి గారు ,మిలటరీ రాజుగారు, కిషోర్ గారు,చింటూ,సతీష్ గారు, కలిదిండి మురళి రాజుగారు, నెహ్రూ గారు కృష్ణానగర్ లో ఉండే ప్రతి ఒక్కరూ అలాగే మేమంటూ సాయం అందించే సహాయాన్ని అందించే ఉప్పల్ టీం వారు ముఖ్యంగా సునీల్ గారు వారితోపాటు కీసర పరిసర గ్రామాల్లో ఉండే సోదరులందరికీ, ఈసీఐఎల్ సైనిక్పురి ప్రాంతాల్లో ఉండే క్షత్రియులు అందరికీ పేరుపేరునా శ్రీ సూర్య యూత్ అసోసియేషన్ వారు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు...










0 Comments