కాకినాడ జిల్లా పెద్దాపురం, సామాజిక స్పందన
ప్రతి సంవత్సరంలానే స్నేహ ఆర్ట్స్ నాటక పరిషత్ చంద్రమాంపల్లి ఆధ్వర్యంలో 2023 జనవరి 24 25 26 తేదీలల్లో ఉభయ తెలుగు రాష్ట్రాల జాతీయస్థాయి నాటిక పోటీలు నిర్వహిస్తున్నట్టు స్నేహా ఆర్ట్స్ నాటక పరిషత్ అధ్యక్ష, కార్యదర్శులు గొందేసి రాజా, ఇంధన బ్రహ్మానందంలు ఒక ప్రకటనలో తెలిపారు. స్నేహా ఆర్ట్స్ కమిటీ సమావేశం చంద్రమాంపల్లిలో జరిగింది. నాటికల పోటీని నిర్వహించాలని కమిటీ ఏకగ్రీవంగా నిర్వహించిందని తెలిపారు. నాటక పరిషత్ నిర్వహణకు ఎంతో మంది తోడ్పాటును అందింస్తున్నారని అందువల్లనే ఇంత బృహత్తర కార్యక్రమాన్ని నిర్వహించగలుగుతున్నామని తెలిపారు. ఈ సంవక్సరం కూడా అందరూ సహాయ సహకారాలు అందించి నాటిక పోటీని విజయవంతం చేయ్యడానికి తోడ్పడాలని విజ్ఞప్తి చేసారు.
@@@@@@ మరిన్ని వార్తలు @@@@@@
కార్మికులను పస్తులు పెడుతున్న పట్టాభి యాజనాన్యం
సామాజిక స్పందన, పెద్దాపురం
పట్టాభి ఆగ్రోపుడ్స్ యాజమాన్యం కార్మికులను పస్తులు పెడుతుందని సిఐటియు నాయకులు విమర్శించారు. తొలగించిన కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని కోరుతూ గేటు ముందు తొలగించిన కార్మికులతో ధర్నా నిర్వహించారు. కంపెనీ నుండి ఎటువంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా కార్మికులను పట్టాభి ఆగ్రోపుడ్స్ యాజమాన్యం బయటకు నెట్టేసిందని అన్నారు. 6 నెలల కాలం దాటిపోయి కార్మికులు అనేక అవస్ధలు పడుతున్నారని, కార్మిక కుటుంబాలు పస్తులతో గడపాల్సి వస్తుందని అన్నారు. ఆకలితో ఉన్న కుటుంబాల ఘోష ఊరుకునే పోదని హెచ్చరించారు. ప్రతి మాటకు ముందు, తరువాత కార్మికులదే తప్పంటూ మాట్లాడే యాజమాన్యం వారు చేసిన తప్పులను దాచిపెడుతూ అధికారులను, ప్రభుత్వాన్ని తప్పుదారి పట్టిస్తుందని అన్నారు. మహిళా కార్మికులకు కూడా కనీసం మరుగుదొడ్లు లేవంటే కంపెనీలో పరిస్దితి ఎంత దారుణంగా ఉందో అర్దం చేసుకోవచ్చని అన్నారు. తక్షణం కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని, పిఎఫ్, ఇఎస్ఐ కట్టాలని, కంపెనీలో అంబులెన్స్ సౌకర్యం కల్పించాలని, రెస్ట్ రూమ్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేసారు.
ఈ ధర్నాలో కందా శివ, ముడే విష్ణు, బారంగి తేజా, యెాహాన్ రాజు, కోనా బాలరాజు, కొమ్ము వరప్రసాద్, పెంకే శ్రీను, దేవాబత్తుల రమేష్ బాబు, బేదంపూడి పెదబాబు, జాన్, చక్రం తదితరులు పాల్గోన్నారు.
@@@@@@ మరిన్ని వార్తలు @@@@@@@@
విమానంలో పాము, ఆందోళనకు గురైన ప్రయాణికులు.
సాధారణంగా మన ఇంటికి పాములు వస్తే చాలా కంగారు పడుతుంటాము. అది వెళ్లిపోయే వరకు లేకపోతే చంపే వరకు నిద్రపోము. అలాంటిది విమానంలో పాము కనిపిస్తే ఎలా ఉంటుంది.ప్రయాణికులు ఎంతగా ఆందోళన చెందుతారో ఊహించుకోంది. సరిగ్గా ఇలాంటి సంఘటనే అమెరికాలో జరిగింది. ప్రయాణికులు పామును గుర్తించడంతో విమానాన్ని తనిఖీ చేసి పామును బయటకు తీశారు.ఈ ఘటనపై యునైటెడ్ ఎయిర్ లైన్స్ స్పందించింది. ప్రయాణికులు పాము గురించి సిబ్బందిని అప్రమత్తం చేశారని.. పామును పట్టుకుని పరిస్థితి చక్కదిద్దడానికి అధికారులను పిలిచామని ప్రకటనలో వెల్లడించింది. న్యూజెర్సీలో విమానం ల్యాండ్ అయిన తర్వాత టాక్సే వేకు వెళ్తున్న సమయంలో బిజినెస్ క్లాస్ లో ప్రయాణికులు పామును గుర్తించారు. ప్రయాణికులు కేకలు వేస్తూ.. తమ పాదాలను పైకి పెట్టుకున్నారు. పామును విమానం నుంచి పట్టుకున్న తర్వాత ప్రయాణికులు తమ సామానుతో విమానం నుంచి దిగారు.
సాధారణంగా గార్టెర్ పాములు ఫ్లోరిడాలో కనిపిస్తాయి. 18 నుంచి 26 అంగుళాల పొడవు ఉండే ఈ పాములు మానవులకు, జంతువులకు హాని కలిగించవు. అయితే ఉద్దేశపూర్వకంగా వేధిస్తేనే కాటు వేస్తాయి. దీని కాటువల్ల మానవుడికి పెద్దగా అపాయం ఉండదు. అంతకు ముందు ఫిబ్రవరి నెలలో కూడా మలేషియాలో ఎయిర్ ఏషియా విమానంలో కూడా ఇలాంటి సంఘటనే జరిగింది. విమానం గాలిలో ఉండగా ప్రయాణికులు పామును గుర్తించారు.











0 Comments