అంత భయపడితే హైదరాబాద్ లో ఎందుకుంటాం?తలసాని శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు


హైదరాబాద్‌, సామాజిక స్పందన

ఐటీ, ఈడీ దాడులకు భయపడబోమని.. తాటాకు చప్పుళ్లకు బెదిరేదిలేదని తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ అన్నారు.ఏదైనా రాజకీయంగానే ఎదుర్కోవాలి తప్ప.. టార్గెట్‌ చేసి దాడులకు పాల్పడటం సరికాదని చెప్పారు. హైదరాబాద్‌లో మీడియాతో ఆయన మాట్లాడారు. మంత్రి మల్లారెడ్డి ఇళ్లు, కార్యాలయాల్లో ఐటీశాఖ సోదాలపై ఆయన స్పందించారు.

''ఐటీ, ఈడీ దాడులు సాధారణంగా జరిగితే మేం తప్పించుకోం.. కానీ లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తున్నారు. ఈ దాడులు ముందే ఊహించాం.. సీఎం ముందే చెప్పారు. ఈరోజు వ్యవస్థలు మీ చేతిలో ఉండొచ్చు.. రేపు మా చేతిలో ఉండొచ్చు. దాడులకు తెరాస నాయకత్వం భయపడదు. అంత భయపడితే హైదరాబాద్‌లో ఎందుకుంటాం? దాడుల అంశాన్ని ప్రజాక్షేత్రంలోకి తీసుకెళ్తాం. భాజపా ఇలా ఎందుకు చేస్తోందనే విషయంపై ప్రజల్ని చైతన్య పరుస్తాం. వ్యవస్థలు తమ చేతిలో ఉన్నాయని భాజపా ఇలాంటి చర్యలకు పాల్పడటం సరికాదు. ఏం జరుగుతుందో భవిష్యత్తులో చూస్తారు'' అని తలసాని వ్యాఖ్యానించారు.

Post a Comment

0 Comments

Latest News

Powered by Blogger.

Admin

Admin
Content published by Samajika Spandana.