కార్మిక హక్కులను కాపాడుకుందాం : సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి చెక్కల రాజ్ కుమార్

 


పెద్దాపురం, సామాజిక స్పందన

కార్మికులకు రాజ్యాంగం ద్వారా అనేక హక్కులు కల్పించడం జరిగిందని వాటిని కాపాడుకోవాల్సిన బాద్యత మనలోని ప్రతి ఒక్కరికి ఉండాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి చెక్కల రాజ్ కుమార్ అన్నారు. రాజ్యాంగ దినోత్సవం సందర్బంగా  పెద్దాపురం వాలుతిమ్మాపురం రోడ్ లో ఉన్న పట్టాభి ఆగ్రోపుడ్స్ గేటు ముందు అంబేద్కర్ చిత్రపటానికి, మున్సిపల్ సెంటర్ లో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రాజ్యాంగం ప్రతి కార్మికుడికి 8 గంటల పని విదానాన్ని, సమాన పనికి సమాన వేతనాన్ని, పిఎఫ్, ఇఎస్.ఐ సౌకర్యాన్ని, మహిళలకు ప్రసూతి సెలవులను కల్పించిందని అన్నారు. రాజ్యాంగం ద్వారా భూములు, కరెంటు, బ్యాంక్ లో లోన్ లు తీసుకున్న యాజమాన్యాలు నేడు అదే రాజ్యాంగం కార్మికులకు కల్పించిన హక్కులను తుంగలో తొక్కుతున్నాయని అన్నారు. రాజ్యాంగం ఆమెాదించి 73 సంవత్సరాలు అవుతున్నా నేటికి వాటిలోని అంశాలను అమలు చేయాలని ఆందోళన చేయాల్సిన దుస్దితి ఏర్పడిందని అన్నారు. అందరికీ సమాన అవకాశాలు, సమాన హక్కులు కల్పించిన రాజ్యాంగాన్ని తూట్లు పొడిచే పని కేంద్రంలో బిజెపి చేస్తుందని, దానికి రాష్ట్రంలో వైసిపి వంతపాడుతుందని అన్నారు. రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన భాద్యత దేశంలో ప్రతి ఒక్కరిపై ఉందని తెలిపారు. 


     రాజ్యాంగ పీఠికను ప్రతిజ్ఞ చేసారు. కార్యక్రమంలో సిఐటియు నాయకులు డి.క్రాంతి కుమార్, నీలపాల సూరిబాబు, ఎస్.శ్రీనివాస్, ప్రజానాట్యమండలి నాయకులు ఆర్.వీర్రాజు, డి.కృష్ణ, డి.సత్యనారాయణ, పెయింటింగ్ వర్కర్స్ యూనియన్ నాయకులు వడ్డి సత్యనారాయణ, కరణం అప్పారావు, గూనూరి రమణ, కూనిరెడ్డి అప్పన్న, ఎన్.నరసింహమూర్తి, పట్టాబి ఆగ్రోపుడ్స్ కార్మికులు పెదబాబు, రమేష్, వరప్రసాద్, శ్రీను, బాలరాజు, జాన్, కందా శివ, తేజా, యెాహాన్ తదితరులు పాల్గోన్నారు.

Post a Comment

0 Comments

Latest News

Powered by Blogger.

Admin

Admin
Content published by Samajika Spandana.