ఐడి కార్డుల పేరిట దోపిడీని అరికట్టాలి అని కొత్తపేట టిడిపి నాయకుల డిమాండ్...


కొత్తపేట, కోనసీమ జిల్లా, సామాజిక స్పందన

డ్వాక్రా మహిళ గ్రూపు సభ్యులు, ఉపాధిహామీ పథకం సంబంధించి కూలీలను సైతం అక్రమార్కులు వదిలిపెట్టడం లేదు  అంటూ విమర్శలు గుప్పించారు కొత్తపేట టిడిపి నాయకులు.. 

రాష్ట్రంలో అవినీతికి అంతే లేకుండా పోతుంది. చివరకు ఐడెంటిటీ కార్డులు పేరుతో డ్వాక్రా మహిళా సభ్యులు, ఉపాధి కూలీలను నుండి (100)వంద రూపాయలు, రూ. 58 రూపాయలు వసూలు చేస్తూ దోపిడీకి పాల్పడుతున్నారు..

కొత్తపేట నియోజకవర్గంలో 75, 000 పైబడి డ్వాక్రా సభ్యులు ఉండగా 50 నుండి 60 వేల మధ్య ఉపాధి కూలీలు ఉన్నారు.. ఇప్పటికే వారందరికీ కార్డులు ఉన్న కొత్తగా కార్డులు పేరుతో వసూలు చేయడం తగదు, అని ఆవేదన వ్యక్తం చేశారు. . 

ప్రభుత్వం తమ పార్టీ మూడు రంగులతో కార్డులు పంపిణీ చేయాలనుకుంటే ఉచితంగానే వారికి అందించుకోవాలి తప్ప పేదల నుండి ఈ విధంగా వసూలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం అని అన్నారు. 

పంచాయతీ సర్పంచులు అనుమతి పేరుతో కార్డు కొరకు వసూళ్లకు పాల్పడితే వారిని నిలదీయాలని  ఉన్నతాధికారులు స్పందించి కార్డులు పేరిట చేస్తున్న వసూళ్ళను ఆపాలని డిమాండ్ చేశారు. కొత్తపేట టిడిపి నాయకులు కంఠంశెట్టి శ్రీనివాసరావు, బూసి భాస్కరరావు, పల్లి ఏసు, ముత్యాల బాబ్జి తదితరులు... 


@@@@@@@@@@ మరిన్ని వార్తలు@@@@@@@@


తెలుగు వార్త దినపత్రిక 2023 క్యాలెండర్ ను ఆవిష్కరించిన ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్


 అమరావతి, సమాజిక స్పందన :

 ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ అండ్ మెజిస్ట్రేట్ ఢిల్లీ రావు బుధవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో "తెలుగు వార్త దినపత్రిక 2023 నూతన సంవత్సర క్యాలెండర్ ను ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ" తెలుగు వార్త దినపత్రిక"అనతి కాలంలోనే ప్రజల అభిమానాన్ని చురగొన్నదని ప్రశంసించారు. ఈ సందర్భంగా పత్రిక యాజమాన్యానికి, సిబ్బందికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియచేశారు. 

ఈ కార్యక్రమం మల్లాది ప్రసాదరావు తెలుగు వార్త దినపత్రిక ఏపీ స్టేట్ బ్యూరో ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమంలో రిపోర్టర్స్ ప్రవీణ్, జి.రమేష్,బాలు, తదితరులు పాల్గొన్నారు.    



Post a Comment

0 Comments

Latest News

Powered by Blogger.

Admin

Admin
Content published by Samajika Spandana.