పల్నాడు జిల్లా నరసరావుపేట, సామాజిక స్పందన
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి రాష్ట్రంలో ప్రజాస్వామ్య హక్కులను కాల రాస్తున్నారంటూ దానిలో భాగంగా *ఈ నెల రెండవ తేదీన అమలులోకి తెచ్చిన జీవో నంబర్ 1 రాష్ట్రంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేసే పోరాటాలకు అడ్డుకునేందుకే ఈ జీవో వచ్చిందని,జై భీమ్ భారత్ పార్టీ నరసరావుపేట అసెంబ్లీ అభ్యర్థి గోదా జాన్ పాల్ అన్నారు* రాష్ట్రంలో గత ప్రభుత్వాల లో లేనివిధంగా ప్రస్తుత ప్రభుత్వంలో దళిత కుల ప్రజా సంఘాలు ప్రతిపక్ష పార్టీలతో సహా ప్రతి ఒక్క పౌరుడు ప్రతి ఒక్క కులానికి అన్యాయం జరిగిందంటూ, రాజ్యాంగ ఉల్లంఘన జరుగుతుంది, తమ హక్కులను కాల రాస్తున్నారంటూ వివిధ రూపాలలో ధర్నాలు నిరసనలు రాస్తారోకోలు చేయగా, కోర్టులు కూడా ప్రభుత్వం తీసుకున్న అనాలోచితమైనా నిర్ణయాలను వ్యతిరేకించే విధంగా తీర్పులు వచ్చినప్పటికీ నిస్సిగ్గుగా నేటికీ ప్రభుత్వం అవలంబిస్తున్న తీరు చాలా బాధాకరమని గతంలో *జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావడానికి పాదయాత్రలు, బస్సు యాత్రలో ఎన్నో రూపాలలో కార్యక్రమాలు కేవలం రోడ్ల పైన మాత్రమే జరిగాయి* అన్న విషయాన్ని జగన్ మోహన్ రెడ్డి మరిచిపోయాడని రేపు తిరిగి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి రాకపోతే మరల ఇటువంటి జీవో అతనికే నష్టపరిచే విధంగా ఉంటుందని, అధికారంలో ఉండి కూడా మీరు అమలు పరుస్తున్న జీవో ప్రతిపక్షాలు ప్రజాసంఘాలకు ఒకలాగా అధికార పార్టీకి ఒకలాగా వ్యవహరించడం కూడా ప్రజలు గమనిస్తున్నారని కచ్చితంగా వాక్ స్వాతంత్రాన్ని ప్రజాస్వామిక విధానాలను ఖూనీ చేసే ప్రయత్నం *జగన్మోహన్ రెడ్డి మానుకోకపోతే పూర్తిస్థాయిలో తమ అధికారాన్ని కోల్పోయి శంకరగిరి మాన్యాలు పట్టక తప్పదని* ఇప్పటికైనా *జీవో నెంబర్ 1 ని రద్దుపరచాలని* లేనిపక్షంలో జై భీమ్ భారత్ పార్టీ ఆధ్వర్యంలో అన్ని రాజకీయ పార్టీలను ప్రజాసంఘాలను కలుపుకొని పెద్ద ఎత్తున కార్యాచరణకు పిలుపునిస్తామని *జై భీమ్ భారత్ పార్టీ పల్నాడు జిల్లా నరసరావుపేట అసెంబ్లీ అభ్యర్థి గోదా జాన్ పాల్ ప్రభుత్వానికి తెలియజేశారు. .










0 Comments