ఏపీ రాజధానిపై సీఎం జగన్ కీలక నిర్ణయం, త్వరలో తాను కూడా అక్కడికే అంటూ


విశాఖపట్నం సామాజిక స్పందన :

ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏది అనే అంశంపై రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ సంచలన ప్రకటన చేశారు. త్వరలోనే విశాఖపట్నం ఏపీ రాజధానిగా మారబోతోందన్నారు. తాను కూడా అక్కడికే షిఫ్ట్ అవుతున్నట్లు ప్రకటించారు సీఎం జగన్..

మార్చిలో విశాఖలో జరిగే గ్లోబల్ సమ్మిట్‌కు వ్యాపారవేత్తలు, పెట్టుబడిదారులు రావాలని ఆహ్వానించారు సీఎం జగన్.

వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్

దేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని పేర్కొన్నారు ముఖ్యమంత్రి జగన్. వరుసగా మూడు సంవత్సరాలుగా ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌లో ఏపీ నంబర్‌ వన్‌గా నిలిచిందన్నారు. పారిశ్రామిక వేత్తల నుంచి ఫీడ్‌ బ్యాక్‌ ఆధారంగా ఈర్యాంకులు ఇచ్చారని తెలిపారు సీఎం. ఇప్పటికే 6 పోర్టులు రాష్ట్రంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయని, అదనంగా 3 పోర్టులు నిర్మాణంలో ఉన్నాయన్నారు. మూడు ఇండస్ట్రియల్‌ కారిడర్లు ఉన్నాయన్నారు. పరిశ్రమలకు అనుమతుల విషయంలో సింగిల్‌ డెస్క్‌ విధానం అమల్లో ఉందని, 21 రోజుల్లో అనుమతులు ఇస్తున్నామని తెలిపారు సీఎం జగన్. వివిధ ఉత్పత్తులకు సంబంధించ తయారీ రంగంలో క్లస్టర్లు ఉన్నాయన్న ఆయన.. విశాఖపట్నం త్వరలో రాజధాని కాబోతుందని ప్రకటించారు. విశాఖపట్నం వేదికగానే ఈ ఏడాది మార్చి 3, 4 తేదీల్లో గ్లోబల్‌ సమ్మిట్‌ నిర్వహిస్తున్నామన్నారు..

Post a Comment

0 Comments

Latest News

Powered by Blogger.

Admin

Admin
Content published by Samajika Spandana.