హైదరాబాద్‌, తెలంగాణ, సామాజిక స్పందన

 తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు సర్కారు గుడ్‌న్యూస్‌ చెప్పింది. ఉద్యోగులకు ఒక డీఏ (2.73 శాతం) మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది..

జనవరి పింఛన్‌తో కలిపి ఫిబ్రవరిలో పింఛన్‌దారులకు డీఏ చెల్లించనుంది. 2021 జులై నుంచి 2022 డిసెంబర్‌ నెలాఖరు వరకు 8 విడతల్లో డీఏ బకాయిలను జీపీఎఫ్‌లో జమ చేయనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది.

సీఎం కేసీఆర్ నిర్ణయం మేరకు ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు కరవు భత్యం (DA) 2.73 శాతం పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌ రావు తెలిపారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. ఉద్యోగులు, పెన్షనర్ల డీఏను 17.29 నుంచి 20.02 శాతానికి పెంచినట్లు తెలిపారు. డీఏ పెంపుతో 4.40 లక్షల మంది ఉద్యోగులు, 2.88 లక్షల మంది పెన్షనర్లకు లబ్ధి చేకూరనున్నట్లు ఆయన పేర్కొన్నారు.