గుంటూరు, సామాజిక స్పందన:
మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ తెదేపాలో చేరనున్నారు. ఈనెల 23న మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు సమక్షంలో చేరేందుకు రంగం సిద్దమైంది అని విశ్వసనీయ సమాచారం.
భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజుతో ఇమడలేక ఆయన పార్టీని వీడిన సంగతి తెలిసిందే. ఈనెల 16న భాజపాకు రాజీనామా చేసిన ఆయన భవిష్యత్ కార్యాచరణపై చర్చించటానికి సన్నిహితులు, శ్రేయోభిలాషులు, అభిమానులతో ఆదివారం గుంటూరులోని తన నివాసంలో సమావేశమయ్యారు. గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాలతో పాటు కృష్ణా, ఎన్టీఆర్, ప్రకాశం జిల్లాల నుంచి పలువురు హాజరయ్యారు..
త్వరలోనే నా రాజకీయ నిర్ణయాన్ని ప్రకటిస్తానని మీడియాకు వెల్లడించారు. అయితే, కన్నా తెదేపాలో చేరడం ఖాయమైనట్టు సమాచారం..
ఆ చిన్నారి చివరిక్షణాల్లో చేసిన వీడియో నా మనసు కలచివేసింది: పవన్ కళ్యాణ్
అమరావతి, సామాజిక స్పందన
చిన్నారి రేవతి మరణం తీవ్రంగా బాధించిందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. నాలుగేళ్ల కిందట తాను పోరాట యాత్ర చేస్తున్న సమయంలో విశాఖ నగరంలో తనను కలిసిన రేవతి చనిపోవడం తనను తీవ్రంగా కలచివేసిందని ఓ ప్రకటనలో తెలిపారు..
''పుట్టుకతోనే అతి భయంకరమైన మస్కులర్ డిస్ట్రోఫీ వ్యాధితో జన్మించిన రేవతి ఒక్క అడుగుకూడా నడవలేని స్థితిలో ఉండేది. నాలుగేళ్ల కిందట ఆ చిన్నారి నన్ను కలిసేనాటికి ఏడెనిమిదేళ్ల వయసు ఉంటుంది. అలాంటి అనారోగ్య స్థితిలో చదువుకుంటూ, సంగీతం నేర్చుకుంటూ ఆ చిన్నారి చూపిన మానసిక ధైర్యం నన్ను అబ్బురపరిచింది. కొన్ని భక్తి గీతాలు కూడా నా ఎదుట ఆలపించి ఆశ్చర్యపరిచింది.
ఆమెకు నేను ఇచ్చిన 3 చక్రాల బ్యాటరీ సైకిల్‌పై పాఠశాలకు వెళ్లేదని, భగవద్గీతలోని 750 శ్లోకాలను కంఠస్థం చేసిందని తెలిసి చాలా అనందించాను. వ్యాధి కారణంగా ఆ చిన్నారి 12 ఏళ్లకే ప్రాణాలు కోల్పోవడం చాలా బాధాకరం. తుదిశ్వాస విడిచే సమయంలోనూ భగవన్నామ స్మరణ చేస్తూ ఉన్న వీడియో నా మనసును కలచివేసింది. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నా. పుట్టినప్పుడే ఆమె ఎక్కువ కాలం బతకడం కష్టం అని డాక్టర్లు చెప్పినా.. 12 ఏళ్ల పాటు కంటికి రెప్పలా కాపాడుకున్న రేవతి తల్లిదండ్రులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా'' అని పవన్ కల్యాణ్ ట్విటర్‌లో పేర్కొన్నారు.
.jpg)










0 Comments