కోనసీమ జిల్లా, కొత్తపేట, సామాజిక స్పందన
రాష్ట్రంలో అరాచక పాలన సాగుతుందని, రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి అస్తవ్యస్తం చేస్తున్నారని ధ్వజమెత్తారు కొత్తపేట నియోజకవర్గ మాజీ శాసన సభ్యులు, మరియు రాష్ట్ర టిడిపి ఉపాధ్యక్షులు బండారు సత్యానందరావు.
కృష్ణా జిల్లా గన్నవరంలో పార్టీ కార్యాలయంపై దాడి ఘటనతో మరోసారి ఈ విషయం బట్టబయలైందని బండారు సత్యానందరావు అన్నారు. తాడేపల్లి ప్యాలెస్ ఆదేశాలతో రాష్ట్రం రావణకాష్టంలా మారుతున్నదని అన్నారు. నందమూరి తారక రామారావు గారి కుటుంబంలోని మహిళలపై గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తే దాడులు చేస్తారా అని ఆయన ప్రశ్నించారు.
గన్నవరం టిడిపి కార్యాలయం పై రౌడీ మూకలు విచక్షణా రహితంగా దాడి చేయడం, టిడిపి పార్టీ కార్యాలయంలోని సామాగ్రిని ధ్వంసం చేసి మారణహొమం సృష్టించడం రాష్ట్రంలో అరాచక పాలనకు పరాకాష్టని పట్టపగలు టిడిపి పార్టీ కార్యాలయంపై దాడి చేయడంతోపాటు పార్టీ నాయకులు, కార్యకర్తలపై కత్తులు, కర్రలతో విచాక్షణారహితంగా కొట్టి తిరిగి టిడిపి నేతలపైన కేసులు పెట్టడం దుర్మార్గమైన చర్యగా అభివర్ణించారు. టీడీపీ నేతలుపై అక్రమ కేసులు పెట్టడాన్ని సత్యానందరావు తీవ్రంగా ఖండించారు.
అసలు మనం ఎక్కడ ఉన్నాం ..ఆటవిక యుగంలో ఉన్నామా ? కిరాతక పాలనలో ఉన్నామా ? అని ప్రశ్నించారు. ఇటీవల చంద్రబాబు నాయుడు గారి తూర్పు గోదావరి జిల్లా అనపర్తి పర్యటనలోనూ ఆటంకాలు కల్పించిన, పర్యటనకు వచ్చిన భారీ ప్రజా స్పందన చూసి ఓర్వలేక వైసిపి పార్టీ ఇలాంటి నీచపు రాజకీయాలు చేస్తొందని, ఇది మంచి పద్దతి కాదని అన్నారు.
రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ, ప్రశ్నించిన వారిపై దాడులు నిర్వహిస్తూ రాష్ట్రాన్ని రావణకాష్టం లాగా తయారు చేసి ప్రజలను, ప్రతిపక్ష పార్టీలను భయ భ్రాంతులకు గురి చేయాలని వైసిపి నాయకులు ప్రయత్నిస్తున్నారని అన్నారు.రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాల దృశ్యా రాష్ట్ర నూతన గవర్నర్ వచ్చిన తర్వాత ఈ అంశాలపై దృష్టి సారించి శాంతి భద్రతలు కాపాడి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని కోరారు.
వైసీపీ నాయకులు చేస్తున్న అరాచకాలను ప్రజలు గమనిస్తున్నారని దీనికి తగిన మూల్యం చెల్లించుకుంటారని ఆయన పేర్కొన్నారు.ఈ కార్యక్రమం పల్లి యేసు,గుర్రాల నాగభూషణం మరియు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.










0 Comments