కాకినాడ జిల్లా, సామాజిక స్పందన
కాకినాడ జిల్లా సాంబమూర్తి నగర్ ఏప్రిల్ 25: స్థానిక విభిన్న ప్రతిభావంతుల మరియు వయోవృద్ధుల సహాయ సంస్థ కార్యాలయం వద్ద ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా దివ్యాంగ నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు వారికి మద్దతుగా మంగళవారం కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ విభిన్న ప్రతిభవంతుల కమిటీ మరియు జిల్లా అధ్యక్షులు మండపాక అప్పన్న దొర ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలో పాల్గొని సంఘీభావం ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజశేఖర్ రెడ్డి 200 రూపాయలన్న పింఛన్ 500 చేస్తే 500 రూపాయల నుండి 3000 చేసిన ఘనత చంద్రబాబుకు దక్కుతుందని ఈ ప్రభుత్వం వచ్చి నాలుగు సంవత్సరాలయిన దివ్యాంగులకు ఒక రూపాయి పింఛన్ పెంచలేదు కానీ అన్ని రేట్లు విపరీతంగా పెంచిందని బ్యాక్ లాక్ పోస్టులు ఎక్కడ ఒక ఉద్యోగం కూడా దివ్యాంగులకు వేయలేదని వివాహ ప్రోత్సాహం పదో క్లాస్ పాస్ అవ్వాలని ఆంక్ష విధించడం ఎంతవరకు సమంజసమని దివ్యాంగులుకు చదువుతో పని లేకుండా అర్హుడైన ప్రతి ఒక్కరికి వివాహ ప్రోత్సాహం అందించాలని అన్నారు. దివ్యాంగుల అన్ని సమస్యలు తీర్చాలని లేదంటే తీవ్రమైన పోరాటాలు చేయడంతో పాటు దివ్యాంగుల ఉసురు తగిలి నువ్వు ఇంటికి పోవడం తధ్యమని తీవ్రంగా హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో కాకినాడ జిల్లా టిడిపివిభిన్న ప్రతిభవంతుల కార్యదర్శి ఎస్కే కరిముల్లా, టిడిపి జిల్లా విభిన్న ప్రతిభావంతుల ఉపాధ్యక్షులు నరం శ్రీనివాసరావు, విభిన్న ప్రతిభావంతుల టిడిపి రాష్ట్ర నాయకులు గింజల దుర్గాప్రసాద్ యాదవ్, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జాయింట్ యాక్షన్ కమిటీ ప్రధాన కార్యదర్శి పొలమూరి పెద్దకాపు, జిల్లా జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ గుణపర్తి కొండలరావు, జేఏసీ సభ్యులు జలతారపు వెంకన్న, మంద అప్పారావు, ఆర్ నాగేశ్వరరావు , చింతపల్లి పవన్ తదితరులు పాల్గొన్నారు.
@@@@@@@@ మరిన్ని వార్తలు @@@@@@@@
పేదల సంక్షేమానికి కేంద్ర బడ్జెట్లో నిధులు పెంచాలి - అదాని అవినీతిపై సమగ్ర దర్యాప్తు నిర్వహించాలి: సీపీఎం డిమాండ్
కాకినాడ జిల్లా, పెద్దాపురం, సామాజిక స్పందన
సిపిఎం పెద్దాపురం మండల కమిటీ ఆధ్వర్యంలో కేంద్ర బడ్జెట్ లో పేదల సంక్షేమానికి నిధులు కేటాయించాలని కోరుతూ తహశీల్దారు కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి అనంతరం తహశీల్దారుకి వినతిపత్రం అందజేసారు.
ఈ ధర్నాను ఉద్దేశిస్తూ సిపిఎం మండల కార్యదర్శి నీలపాల సూరిబాబు మాట్లాడుతూ, 2023- 24 ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్లో ఆహార సబ్సిడీలకు కోత విధించారని, ఉపాది హామీ పథకానికి గత సంవత్సరం కంటే 28 వేల కోట్ల రూపాయలు నిధులు తగ్గించారని, నూతన ఉపాధి కల్పన కనీసంగా ప్రస్తావించలేదని, రైతాంగాన్ని వెన్ను విరిచేలా యూరియా సబ్సిడీలను తగ్గించారని, దీంతో పేదలపై భారాలు పెరిగి రైతులు కష్టాలు పెరుగుతాయని, ఇదే సందర్భంలో కార్పొరేట్లకు ఆదాయపు పన్నును 30 శాతం నుండి 22 శాతానికి తగ్గించడాన్ని ప్రజాస్వామిక వాదులు అందరూ గమనించాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరొకసారి కేంద్ర ప్రభుత్వం ఉత్తిచేతులు చూపిందని, పోలవరం నిధులు గాని, విభజన చట్టం ఊసు లేకుండా, విశాఖ రైల్వే జోన్, కడప ఉక్కు ఫ్యాక్టరీ ప్రస్తావన తీసుకు రాలేదని, కాకినాడ జిల్లా వాసులు ఎన్నాళ్ళనుండో ఎదురుచూస్తున్న కాకినాడ మెయిన్ లైన్, పట్టిసీమ రైల్వే లైన్ లను పూర్తిగా విస్మరించారని విమర్శించారు, ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి ఇంత అన్యాయం చేస్తున్న కేంద్ర ప్రభుత్వ వైఖరిపై అధికార పార్టీ వైఎస్ఆర్సిపి నాయకులు కనీసం గా కూడా స్పందించలేదని, ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం, జనసేన పార్టీలు కూడా బిజెపి వైఖరిని ప్రశ్నించకపోవడం రాష్ట్ర ప్రజలు చేసుకున్న దౌర్భాగ్యం అని అన్నారు. తక్షణం పేదల సంక్షేమానికి కేంద్ర బడ్జెట్లో నిధులు పెంచాలని, కార్పొరేట్ కంపెనీలు, శతకోటీశ్వరులపై సంపద పన్ను విధించాలని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన హామీలు అమలు చేయాలని, విశాఖ ఉక్కు మరియు ప్రభుత్వ రంగ సంస్థల ప్రవేటీకరణ ఆపాలని, పెట్రోల్ డీజిల్ గ్యాస్ నిత్యవసర సరుకులు ధరలు అదుపులోకి తీసుకురావాలని, ఉపాధి హామీ పథకాన్ని 200 రోజులకు పెంచి పట్టణ ప్రాంతాల్లో కూడా అమలు చేయాలని, అదాని అవినీతిపై సుప్రీంకోర్టు ద్వారా సమగ్ర విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు సిరిపురపు శ్రీనివాస్, కేదారి నాగు, గడిగట్ల సత్తిబాబు,సిరిపురపు మరిడియ్య, సిహెచ్. విశ్వనాధం, డి.కృష్ణ, ఆర్. వీర్రాజు, రొంగల సుబ్బలక్ష్మీ, సిహెచ్. సత్యనారాయణ, రాజమంద్రపు రామారావు, పెంటయ్య, డి.సత్యవతి, మాగాపు నాగు తదితరులు పాల్గోన్నారు.
@@@@@@ మరిన్ని వార్తలు చదవండి@@@@@@
పెద్దాపురం పట్టణంలో ఘనంగా రెడ్ బుక్ డే
కాకినాడ జిల్లా, పెద్దాపురం, సామాజిక స్పందన
పిబ్రవరి 21 రెడ్ బుక్ డే సందర్బంగా, మాతృభాష దినోత్సవం సందర్బంగా పెద్దపురం యాసలపు సూర్యారావు భవన్ లో సాహితీ స్రవంతి, యుటిఎఫ్, జెవివి, జనవిజ్ఞానవేదిక, ప్రజానాట్యమండలి ఆధ్వర్యంలో సభ జరిగింది. సాహితీ స్రవంతి పెద్దాపురం కార్యదర్శి కొత్త శివ అధ్యక్షతన జరిగింది. శ్రీశ్రీ సాహిత్యంపైన సాహితీ స్రవంతి జిల్లా అధ్యక్షులు జోస్యుల కృష్ణబాబు ప్రసంగించారు. శ్రీశ్రీ ని తడవని తెలుగు కవి ఉండరని అన్నారు. తెలుగు సాహిత్యం ప్రతి పేజిలో శ్రీశ్రీ కనపడతారని తెలిపారు. కష్టజీవులకు ఇరువైపుల నిలబడే వారే నిజమైన కవి అని శ్రీశ్రీ అన్న మాట మనం గుర్తు పెట్టుకోవాలని అన్నారు. 1848 పిబ్రవరి 21న కమ్యూనిస్టు ప్రణాళిక విడుదల చేసిన సందర్బంగా ప్రపంచ వ్యాపితంగా రెడ్ బుక్ డె జరుపుకుంటున్నారని అన్నారు. చాలా చిన్న పుస్తకంలో ప్రపంచ చరిత్ర మెుత్తాన్ని ముందు ఉంచిన పుస్తకంగా ప్రణాళిక నిలబడిందని అన్నారు. మాతృభాషను కాపాడు కోవాల్సిన భాద్యత ప్రతి ఒక్కరిపై ఉందని అన్నారు. సాహితీ స్రవంతి గౌరవాధ్యక్షులు చల్లా విశ్వనాధం, జనవిజ్ఞాన వేదిక రాష్ట్ర నాయకులు బి. అనంతరావు, జిల్లా కార్యదర్శి బుద్దా శ్రీనివాస్, యుటిఎప్ నాయకులు శివశంకర్, సూరిబాబు, ప్రజానాట్యమండలి కార్యదర్శి రొంగల వీర్రాజు ప్రసంగించారు.

శ్రీశ్రీ కవితలను పఠించారు. కార్యక్రమంలో వంగలపూడి శివకృష్ణ, ఉప్పిటి రవి, సూరిబాబు, స్వర్ణకుమార్, సలాది సాయి సత్యనారాయణ, తాడిగడప సుబ్బారావు, తిరువెంగళాచార్యులు, చింతల సత్యనారాయణ, పూడి శ్రీనివాస్, కూనిరెడ్డి అరుణ, డి.కృష్ణ, ఎమ్.రాంబాబు, సత్యనారాయణ తదితరులు పాల్గోన్నారు. శ్రీశ్రీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు.
0 Comments