కాకినాడ జిల్లా, పెద్దాపురం, సామాజిక స్పందన
పెద్దాపురం మునిసిప్సలిటీ 8,11 వర్డ్స్ సచివాలయంలో సిబ్బంది మరియు వాలెంట్రీస్ కి వినియోగదారుల చట్టం 2019 గురించి అవగాహన కల్పిస్తున్న టౌన్ ప్రెసిడెంట్ భళ్లమూడి సూర్యనారాయణ మూర్తి. కల్తీలు, మోసపూరిత వ్యాపారాలు , వస్తువుల నాణ్యత , మరియు మందుల లొ డూప్లికేట్ లు గుర్తించడం, వంటి మొదలుకు అంశాలలో వినియోగదారులు అవగాహన కలిగి ఉండాలని సూచించారు . ఎక్స్పైరీ డేట్ మరియు కంపెనీ యొక్క విలువలు తెలుసుకోవాలని, వినియోగదారులు నాణ్యత కలిగిన వస్తువులనే కొనండని, ఇండియన్ స్టాండర్డ్ గుర్తులున్నవే కొనండని, బంగారపు వస్తువులకు హాల్ మార్క్ వున్నదిలేనిది గమనించమని తేడాలుంటే వినియోగదారుల కామిషన్ ఫిర్యాదులు చేయవచ్చని ఆయన తెలియజేశారు. అంతేకాకుండా చట్టలపై అవగాహన కల్పించి ప్రజలలోకి వెళ్ళి వారికి అవగాహన కల్పిస్తున్నామని మూర్తి తెలియజేశారు ఈ సమావేశంలో సెక్రటరీ ప్రకాష్, ఎం భాస్కరావు, కె వి వి లక్ష్మి స్టాఫ్, వాలెంట్రీస్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
@@@@@ మరిన్ని వార్తలు చదవండి@@@
విద్యుత్ కోతలనే మాటే వినిపించకూడదు: అధికారులకు సీఎం ఆదేశం
అమరావతి, సామాజిక స్పందన
వేసవిలో విద్యుత్ కొరత లేకుండా చూడాలని ఏపీ సీఎం జగన్ ఆదేశించారు. విద్యుత్ కొరత వల్ల కోతలనే మాట వినిపించకూడదని అధికారులకు సూచించారు..
కరెంట్ కోతలు లేకుండా అధికారులు అన్ని రకాలుగా సిద్ధం కావాలన్నారు. విద్యుత్ శాఖపై సీఎం జగన్ శుక్రవారం సమీక్ష నిర్వహించారు. వేసవిలో విద్యుత్ డిమాండ్, రైతులకు కనెక్షన్లపై సమీక్షించిన సీఎం.. అధికారులకు పలు అంశాలపై దిశానిర్దేశం చేశారు.
బొగ్గు నిల్వలపైనా అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సీఎం సూచించారు. థర్మల్ కేంద్రాలకు బొగ్గు కొరత రాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. రైతుల వ్యవసాయ కనెక్షన్ల మంజూరులో జాప్యం ఉండకూడదని.. దరఖాస్తు చేసిన నెలలోనే కనెక్షన్ ఇవ్వాలని ఆదేశించారు. మార్చి నాటికి మరో 20వేల విద్యుత్ కనెక్షన్లు ఇస్తున్నామని అధికారులు ఈ సందర్భంగా సీఎంకు వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా 100 సబ్‌స్టేషన్ల నిర్మాణం పూర్తవుతోందని తెలిపారు.












0 Comments