కాకినాడ జిల్లా, పెద్దాపురం, సామాజిక స్పందన
అక్రమ పద్దతుల్లో నిర్భందాలతో ఉద్యమాలను ఆపాలనుకుంటే అదిజరిగే పని కాదని సిఐటియు పెద్దాపురం మండల కార్యదర్శి డి.క్రాంతి కుమార్ అన్నారు. 20 వ తేదీ విజయవాడలో అంగన్ వాడీ వర్కర్స్ హెల్పర్స్, మధ్యాహ్నొ భోజన కార్మికుల సమస్యల పరిష్కారం కోసం మహాధర్నాకు పిలుపునిచ్చారని అన్నారు. ఈ ఉద్యమాన్ని అణచాలని రాష్ర్టప్రభుత్వం చూస్తుందని ఇది చాలా దుర్మార్గం అన్నారు. నిన్న అర్ధరాత్రి నుండే పోలీసులు సిఐటియు నాయకుల ఇంటికి వచ్చి నోటీసుల ఇవ్వడం నిర్భందించడం చేస్తున్నారని అన్నారు. మహిళల ఇళ్ళకు అర్ధరాత్రి మగపోలీసులు వెళ్ళడం ఏంటని ప్రశ్నించారు. చట్టాల పట్ల కనీస అవగాహన కూడా లేకుండా పోలీసులు వ్యవహరిస్తున్నారని అన్నారు. పోలీసులను ఉపయోగించుకొని ఉద్యమాలను నిర్భందించాలంటే జగన్ మోహన్ రెడ్డి తగిన మూల్యం చెల్లించక తప్పదని అన్నారు. అంగన్ వాడీలకు పక్కనున్న తెలంగాణా రాష్ర్టం కన్నా 1000 రూపాయలు అధనంగా వేతనం ఇస్తానని ప్రకటించారని అన్నారు. కానీ అంగన్ వాడీలను ఇబ్బందుకు గురిచేస్తున్నారని అన్నారు. కచ్చితంగా రేపు విజయవాడలో ధర్నా జరుగుతుందని తెలిపారు. పోలీసులు ఎన్ని నిర్భందాలను పెట్టినా విజయవాడ చేరుకుంటామని తెలిపారు. సమావేశంలో అంగన్ వాడీ యూనియన్ నాయకులు ఉమామహేశ్వరి, స్నేహలత, సిఐటియు నాయకులు ఎస్. శ్రీనివాస్, మిడ్డే మిల్ వర్కర్స్ యూనియన్ నాయకులు కరక సుబ్బ లక్ష్మీ తదితరులు పాల్గోన్నారు.










0 Comments