విశాఖపట్నం, సామాజిక స్పందన
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ వైజాగ్ లో ప్రారంభమయింది.
సమ్మిట్ లో తొలుత రాష్ట్ర గీతం 'మా తెలుగు తల్లికి' గీతాన్ని ఆలపించారు. ముఖ్యమంత్రి జగన్ జ్యోతిని వెలిగించి సదస్సును ప్రారంభించారు.
ఈ కార్యక్రమానికి రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ, జీఎంఆర్ అధినేత గ్రంధి మల్లికార్జునరావు, ఇన్ఫోటెక్ అధినేత బీవీఆర్ మోహన్ రెడ్డి తదితర ప్రముఖులు హాజరయ్యారు.
మరోవైపు ముఖేశ్ అంబానీని జగన్ ఆప్యాయంగా హత్తుకోవడం అందరినీ ఆకర్షించింది.
జ్యోతి ప్రజ్వలన అనంతరం సీఎస్ జవహర్ రెడ్డి ప్రారంభోపన్యాసం చేశారు. అనంతరం ఏపీ పరిశ్రమల మంత్రి గుడివాడ అమర్ నాథ్ ప్రసంగించారు.
ఏపీలో పరిశ్రమల ఏర్పాటుకు పుష్కలమైన అవకాశాలు ఉన్నాయని చెప్పారు. పరిశ్రమలకు అవసరమైన మౌలిక వసతులను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.
ముఖ్యమంత్రి జగన్ నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి దిశగా సాగుతోందని చెప్పారు. సంక్షేమం, అభివృద్ధికి ప్రాధాన్యతను ఇస్తూ జగన్ పాలన సాగుతోందని అన్నారు.
ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చారని చెప్పారు.
ఆర్థిక మంత్రి బుగ్గన మాట్లాడుతూ... రాష్ట్రంలో పలు రంగాల్లో లాజిస్టిక్స్ అద్భుతంగా ఉన్నాయని తెలిపారు.
పునరుత్పాదక రంగంలో పెట్టుబడులకు మంచి అవకాశాలు ఉన్నాయని చెప్పారు. ఐటీ ఆధారిత పరిశ్రమలకు మంచి వాతావరణం ఉందని అన్నారు.
నైపుణ్యం కలిగిన మానవ వనరులకు కొదవలేదని చెప్పారు....
పలు కీలక రంగాల్లో ఏపీ ప్రభుత్వం ఎంవోయూ..!!
ఎన్టీపీసీ ఎంవోయూ రూ.2.35 లక్షల కోట్లు.
ఏబీసీ లిమిటెడ్ ఎంవోయూ రూ.1.20 లక్షల కోట్లు.
రెన్యూ పవర్ ఎంవోయూ రూ.97,500 కోట్లు.
ఇండోసాల్ ఎంవోయూ రూ.76,033 కోట్లు.
ఏసీఎంఈ ఎంవోయూ రూ.68,976 కోట్లు.
టీఈపీఎస్‌ఓఎల్ రూ.65 వేల కోట్లు.
JSW గ్రూప్ రూ.50,632 కోట్లు
హంచ్ వెంచర్స్ రూ.50 వేల కోట్లు.
అవాదా గ్రూప్ రూ. 50 వేల కోట్లు.
గ్రీన్ కో ఎంవోయూ రూ.47,600 కోట్లు.
ఓసీఐఓఆర్ ఎంవోయూ రూ.40 వేల కోట్లు.
హీరో ఫ్యూచర్ ఎనర్జీస్ రూ.30 వేల కోట్లు.
వైజాగ్ టెక్ పార్క్ రూ.21,844 కోట్లు.
అదానీ గ్రీన్ ఎనర్జీ రూ.21,820 కోట్లు.
ఎకోరిన్ ఎనర్జీ రూ.15,500 కోట్లు.
సెరంటికా ఎంవోయూ రూ.12,500 కోట్లు.
ఎన్‌హెచ్‌పీసీ ఎంవోయూ రూ.12వేల కోట్లు.
అరబిందో గ్రూప్ రూ.10,365 కోట్లు.
O2 పవర్ ఎంవోయూ రూ.10 వేల కోట్లు.
ఏజీపీ సిటీగ్యాస్ రూ.10 వేల కోట్లు.
జేసన్ ఇన్ ఫ్రా ఎంవోయూ రూ.10 వేల కోట్లు.
ఆదిత్య బిర్లా గ్రూప్ రూ.9,300 కోట్లు.
షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్ రూ.8,855 కోట్లు.
శ్యామ్ గ్రూప్ రూ.8,500 కోట్లు.
ఆస్తా గ్రీన్ ఎనర్జీ రూ.8,240 కోట్లు.
జిందాల్ స్టీల్ రూ.7,500 కోట్లు.
సెంబ్ కార్ప్ ఎంవోయూ










0 Comments