దిల్లీ, సామాజిక స్పందన
దక్షిణాది రాష్ట్రం కర్ణాటక (Karnataka) అసెంబ్లీ ఎన్నికలకు (Assembly Election) షెడ్యూల్ ఖరారైంది. బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో కేంద్ర ఎన్నికల సంఘం (Election Commission) ఈ రాష్ట్రానికి శాసనసభ ఎన్నికల తేదీలను ప్రకటించింది..
మొత్తం 224 అసెంబ్లీ స్థానాలకు ఒకే దశలో ఎన్నికలు నిర్వహించనున్నారు. మే 10వ తేదీన పోలింగ్ జరగనుంది. మే 13వ తేదీన ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను వెల్లడించనున్నారు. ఈ ఎన్నికలకు ఏప్రిల్ 13న గెజిట్ నోటిఫికేషన్ వెలువడనుంది. ఏప్రిల్ 20 నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కానుంది. నేటి నుంచే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది..
వృద్ధులకు ఇంటి నుంచే ఓటు..
రాష్ట్రంలో మొత్తం 5.21 కోట్ల మంది ఓటర్లున్నారు. ఇందులో పురుషులు 2.62 కోట్లు, మహిళలు 2.59 కోట్లు ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికలకు మొత్తం 58,282 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. ఈ ఎన్నికల్లో ఈసీ తొలిసారిగా 'ఓటు ఫ్రమ్ హోం (Vote From Home)' సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది. 80 ఏళ్ల పైబడిన వృద్ధులు, అంగవైకల్యంతో బాధపడుతున్న వారు ఈ సదుపాయాన్ని వినియోగించుకుని ఇంటి నుంచే ఓటు వేయొచ్చిన కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈసీ) రాజీవ్ కుమార్ వెల్లడించారు. ఈ నిర్ణయంతో రాష్ట్రంలో మొత్తం 12.15 లక్షల మంది వృద్ధులు.. 5.6 లక్షల మంది దివ్యాంగులకు ప్రయోజనం కలగనుంది. ఈ సందర్భంగా సీఈసీ రాజీవ్ కుమార్ ఓ ఆసక్తికర విషయం వెల్లడించారు. రాష్ట్రంలో 16,976 మంది 100ఏళ్లు పైబడిన ఓటర్లున్నట్లు తెలిపారు. శతాధిక వయసు గల ఓటర్లు అత్యధికంగా ఉన్న రాష్ట్రం కర్ణాటకనే కావడం విశేషం.
@@@@@@@ మరిన్ని వార్తలు@@@@@@@@@@
భవన నిర్మాణ కార్మికుల సంక్షేమం బోర్డు పునఃరుద్దరించి, సంక్షేమ పథకాలు అమలు చేయాలి.
పెద్దాపురం, సామాజిక స్పందన
భవన నిర్మాణ కార్మిక సంఘాల నాయకత్వ శిక్షణా తరగతులు సోమవారం స్ధానిక పెద్దాపురం వరహాలయ్య పేటలోని గల కామ్రేడ్ యాసలపూ సూర్యారావు స్మారక భవనం లోని ప్రారంభం కావడం జరిగింది. ఈ సందర్భంగా సిఐటియు కాకినాడ జిల్లా ప్రధాన కార్యదర్శి చెక్కల రాజ్ కుమార్, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు కె.సత్తిరాజు, ఎ.పి బిల్డింగ్&అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ కాకినాడ జిల్లా కార్యదర్శి రొంగల ఈశ్వరరావు మాట్లాడుతూ గత తెలుగుదేశం ప్రభుత్వం భవన నిర్మాణ సంక్షేమ బోర్డు నుండి 450 కోట్లు తమ సొంత పథకాలకు మల్లించడం జరిగిందని అదే బాటలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వారు సంక్షేమ పథకాలకు 430 కోట్లు పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా 450 కోట్లు మళ్లించి గత ప్రభుత్వం కార్మికులను చేసిన అన్యాయమే జగన్ ప్రభుత్వం కూడా చేసిందని వారు అన్నారు. ఈ సంక్షేమ బోర్డులో పథకాలు అమలు కాకుండా రాష్ట్ర ప్రభుత్వం 1214 మెమోను తీసుకొచ్చి సంక్షేమ బోర్డు అమలు కాకుండా అడ్డగించడం జరిగిందని ఇది కార్మిక వ్యతిరేక విధానాల్లో ప్రధానమైన భాగం అని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ప్రభుత్వం కేంద్రంలో ఉన్న బిజెపి కార్మిక ,ప్రజా వ్యతిరేక ,మతోన్మాద విధానాలను అమలు చేస్తుంటే రాష్ట్రంలో అధికారంలోని జగన్ ప్రభుత్వం , ప్రతిపక్షంలోని ఉన్న చంద్రబాబు, జనసేన పవన్ కళ్యాణ్ వ్యతిరేకించకుండా వాటికి మద్దతు పలుకుతున్నారని కార్మికులకు తీవ్ర అన్యాయం చేస్తున్నారని ఈ సందర్భంగా గుర్తు చేశారు.
సంక్షేమ పథకాలు ప్రభుత్వం భిక్షం కాదని కార్మికుల హక్కుని ఆ హక్కును కాపాడుకోవడం కోసం కార్మిక లోకం ఐక్యతతో ఉద్యమించవల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా అన్నారు. ఈరోజు, రేపు జరిగే ఈ భవన నిర్మాణ కార్మికుల శిక్షణా తరగతులలోని సంక్షేమ బోర్డు పునరుద్ధనకై, కార్మిక చట్టాల అమలకై కార్మిక వ్యతిరేక విధానాల అమలు చేస్తున్న ప్రభుత్వ విధానాలను ఎండగట్టేందుకు ఈ శిక్షణ తరగతులు బాగా ఉపయోగపడతాయని ఈ విధంగా కార్మికులు అవగాహన చేసుకుని కార్మిక హక్కులకై, సంక్షేమ పథకాలు భవిష్యత్తు ఉద్యమాలకు సన్నిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా పెద్దాపురం మండల ప్రజా నాట్య మండలి కళాకారుల బృందం పాటలు పాడి కార్మికులను ఉత్సాహ పరిచారు.ఈకార్యక్రమంలో ఆకుల సత్యనారాయణ, ప్రకృతి ఈశ్వరరావు,టి.వెంకట రమణ,టి.జీవా,జి.వెంకట రమణ,కె.సత్యనారాయణ ,దుర్గప్రసాద్, ప్రజానాట్యమండలి క ళాకారులు రొంగల వీర్రాజు, దారపురెడ్డి కృష్ణ, మహపాతి రాంబాబు, దారపురెడ్డి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.












0 Comments