పెద్దాపురం, సామాజిక స్పందన
మహిళల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వాలు పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తున్నాయని సీఐటీయూ అఖిల భారత ఉపాధ్యక్షురాలు జి. బేబీ రాణి అన్నారు . అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్బంగా శ్రామికమహిళా, సీఐటీయూ, ఐద్వా, ఎస్.ఎఫ్. ఐ సంయుక్తంగా నిర్వహించారు. శ్రామిక మహిళా కన్వినర్ ఉమామహేశ్వరి అధ్యక్షతన సభ జరిగింది.
పనిగంటల పోరాటంతో ఆవిర్భవించిన మహిళా దినోత్సవాన్ని నేడు పాలకులు మహిళల ఆటల పోటీలుగా మార్చేశారని అన్నారు. స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తి అవుతున్నా మహిళలకు సమాన హక్కులు ఇవ్వలేదని అన్నారు. అవనిలో సగం ఆకాశంలో సగం అని ఉపన్యాసం ఇస్తున్న పాలకులు 33 శాతం రిజర్వేషన్లు పార్లమెంట్లో అమలు చేయడం లేదన్నారు. స్థానిక సంస్థలో 50 శాతం రిజర్వేషన్ ఇచ్చామని చెప్పే పాలకులు శాసన నిర్ణయాలు చేసే పార్లమెంటుకి పంపడానికి మాత్రం రిజర్వేషన్స్ అమలుకు పూనుకోవడం లేదన్నారు.
పని ప్రదేశంలో ఇప్పటికి మహిళలు చాల అవస్థలు పడుతున్నారని అన్నారు. 12 గంటలు డ్యూటీ చేయించుకుంటున్నారని తెలిపారు. మహిళలకు పనిలో భద్రత కల్పించాలని డిమాండ్ చేసారు. ప్రతి పరిశ్రమలో ను శ్రామిక మహిళా కమిటీ వేయాలని. మహిళలకు సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేసారు. ప్రభుత్వాలు చొరవ తీసుకొని సౌకర్యాలు మెరుగుపరేవిధంగా చూడాలన్నారు.
మహిళా సాధికారత అంటే దండ వేసి దనం పెట్టడం కాదని అన్నారు. మహిళలకు సమాన హక్కులు, సమాన అవకాశాలు కల్పించాలని అన్నారు.
ఈ కార్యక్రమం లో అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ నాయకులూ దాడి బేబీ, ఐద్వా కార్యదర్శి కూనిరెడ్డి అరుణ, ఆశ వర్కర్స్ యూనియన్ నాయకులూ నాగరత్నం, వరలక్ష్మీ, రమణమ్మ, ప్రజానాట్యమండలి నాయకులూ రొంగలి వీర్రాజు, సీఐటీయూ నాయకులూ సిరిపురపు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.











0 Comments