స్థానిక సమస్యల పరిష్కారానికె జనసేన జనబాట కార్యక్రమం: తుమ్మల రామస్వామి బాబు

 

కాకినాడ జిల్లా, సామర్లకోట పట్టణం, సామాజిక స్పందన

జనసేన జన బాట కార్యక్రమానికి ప్రజలను విశేష స్పందన  వస్తుందని పెద్దాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ తుమ్మల రామస్వామి బాబు పేర్కొన్నారు. పెద్దాపురం నియోజకవర్గం సామర్లకోట వీరరాఘవపురం నందు జనసేన జన బాట  కార్యక్రమాన్ని సోమవారం ఉదయం నిర్వహించారు. ఈ సందర్భంగా బాబు మాట్లాడుతూ నియోజవర్గంలో ప్రతి గ్రామంలో ప్రతి ఇంటికి జనసేన పార్టీ సిద్ధాంతాలను తెలియజేస్తూ, స్థానిక సమస్యలను తెలుసుకుని పరిష్కార మార్గం రూపొందించడం ప్రజా మద్దతును కూడగట్టడమే జనసేన పార్టీ జన బాట కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా వీరరాఘవపురంలో జనసేన యువత ఆధ్వర్యంలో  ఏర్పాటు చేసిన మజ్జిగ చలివేంద్రాన్ని బాబు ప్రారంభించి నిర్వాహకులను అభినందించారు. ఈ కార్యక్రమంలో  జనసేన పార్టీ  జిల్లా నాయకులు పిట్టా జానకి రామారావు సామర్లకోట పట్టణ అధ్యక్షులు సరోజ వాసు, తుమ్మల ప్రసాద్ మంచెం సాయిబాబు, జన సైనికులు వీర మహిళలు పాల్గొన్నారు.


@@@@@@ మరిన్ని వార్తలు చదవండి@@@@@@


ప్రజా సమస్యల పరిష్కారం కోసం, పెద్దాపురం లో సిపిఐ కార్యవర్గ సభ్యుల ప్రచారభేరి 


కాకినాడ జిల్లా, పెద్దాపురం, సామాజిక స్పందన

దేశవ్యాప్తంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపైన దేశ వ్యాప్తంగా జరుగుతున్న  సిపిఐ-సిపిఎం ప్రచార భేరి కార్యక్రమం  పెద్దాపురం లో సిపిఐ సిపిఎం ఆధ్వర్యంలో  మెయిన్ రోడ్ లో జరిగింది. సిపిఎం నాయకులు సిరిపురపు శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో  ప్రజలను వుద్దేచించి సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు రావుల వెంకయ్య మాట్లాడుతూ నన్ను నమ్మండి  ఈ దేశానికి కాపలా దారుడిగా వుంటాను అని ఎన్నికలకు ముందు ప్రగల్భాలు పలికిన మోదీ అధికారాన్ని హస్తగతం చేసుకొన్న తర్వాత పేదల రక్తాన్ని పీల్చి కార్పోరేట్ గద్దలకు దోహదపడే విధంగా చట్టాలను చేస్తున్న జిత్తుల మారి మోడీని గద్దెదింపాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచీ ఇప్పటివరకు దేశాన్ని 14 మంది ప్రధానులు కాలంలో 50 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిపోతే, మోడీ ఎనిమిది సంవత్సరాల పరిపాలన లో దాదాపు  'ఒక లక్ష' కోట్ల రూపాయల అప్పులు చేశారని తెలిపారు. నోట్ల రద్దు చేసి నల్లధనాన్ని వైట్ మనీ గా మార్చి, పేదల అకౌంట్లో డబ్బులు వేస్తామని, దేశంలొ ఉగ్రవాదాన్ని అంతం చేస్తానని చెప్పి ఎటువంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండానే నోట్లు రద్దు చేసి దాదాపు వంద మందికి పైగా చావుకు కారకులుగా మిగిలారే తప్ప ఉగ్ర వాదాన్ని పెకిలించ గలిగారా అని ప్రశ్నించారు. పెట్రోల్, డీజల్, గ్యాస్,పప్పు, నూనె ధరలను ఇష్టాను సారంగా పెంచి, సామాన్యుడి నడ్డి విరుస్తున్న  మోడీ కేడి ప్రభుత్వాన్ని ఇదే మంటల్లో వేసి తగులబెట్టే రోజులు దగ్గర్లోనే వున్నాయని ఇప్పటికైనా మేల్కొని మతోన్మాదంతో వ్యవరించకుండా లౌకిక భావజాలంతో దేశాభివృద్ధికై పాటు పడాలనిహితవు పలికారు.

 


  

  సిపిఎం మండల కార్యదర్శి నీలపాలు సూరిబాబు మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్రానికి బీజేపీ ప్రభుత్వము చేసింది ఏమీ లేదని, అయినా అధికార, ప్రతిపక్ష పార్టీలు మోడీకి వూడిగం చేస్తున్నాయని, విషయాలన్నింటిని ప్రజలు నిశితంగా గమనిస్తునారని, రాబోయే కాలంలో ప్రజలు తగిన బుద్ధి చెప్పడానికి సిద్దంగాన్నారని వారు అన్నారు.

      సిపిఐ రాష్ట్ర కార్యవర్గ  సభ్యులు తాటిపాక మధు మాట్లాడుతు రాష్ట్రంలో వున్న జగన్మోహన్ రెడ్డి  రాష్ట్రానికి కేంద్రం ఇంత అన్యాయం చేస్తున్నా ఒక్క మాట కూడా మాట్లాడలేని స్థితిలో ఉన్నారని, పథకాల పేరుతో ప్రజా ధనాన్ని పంచి పెడుతూ, రాష్ట్రాన్ని ఏ మాత్రం అభివృద్ది చేయకుండా ఓటు బ్యాంకు విధానాలను అవలంబిస్తూ అప్పుల పాలు చేస్తున్నారన్నారు.

      ఈ కార్యక్రమంలో కాకినాడ జిల్లా కార్యదర్శి  కె బోడకొండ,  సిపిఎం నాయకులూ కూనిరెడ్డి అప్పన్న, డి.కృష్ణ, గడిగట్ల సత్తిబాబు,  వై.రమేష్, పెంటయ్య, ఆర్.వీర్రాజు, సుబ్బలక్ష్మీ, సత్యనారాయణ, బిల్డింగ్ వర్కర్స్ యూనియన్   రాష్ట్ర ఉపాధ్యక్షులు  పీస్ నారాయణ , సిపిఐ జిల్లా కార్యవర్గ  సభ్యులు పెదిరెడ్ల సత్యనారాయణ , మడకల రమణ , అర్జున రావు సూరిబాబు , అప్పలరాజు  తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments

Latest News

Powered by Blogger.

Admin

Admin
Content published by Samajika Spandana.