కాకినాడ జిల్లా, అన్నవరం, సామాజిక స్పందన
తెలుగుదేశం పార్టీ కాకినాడ పార్లమెంట్ అధ్యక్షుడు జ్యోతుల నవీన్ కుమార్ శనివారం అన్నవరం సత్యనారాయణ స్వామి వారిని దర్శించుకుని అక్కడ నుంచి తనను పార్లమెంటు అభ్యర్థిగా బల పరచాలని ఏడు నియోజకవర్గాల్లో ఉన్న ఇంచార్జిలతో పాటు ద్వితీయ శ్రేణి నాయకులను తన తండ్రి, తన కుటుంబానికి ఉన్న పరిచయస్థులను కలిసి అధినేత చంద్రబాబు నాయుడు ని ముఖ్యమంత్రి స్థానంలో కూర్చో బెట్టేందుకు అందరూ కృషి చేయాలని తాను కాకినాడ పార్లమెంటు బరిలో నిలుచేందుకు నాయకులు అందరి ఆశీస్సులు కావాలని కోరారు.యువతకి ఉద్యోగ అవకాశాలు కలిపించుకునేందుకు జిల్లా అభివృద్ధి చేసుకుని తద్వారా ప్రజాలకి అండగా నిలువడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం మొదలు పెడుతున్నట్టు నవీన్ స్వామి వారి దర్శనం అనంతరం మీడియాతో అన్నారు.
తెలుగుదేశం పార్టీ విజయానికి అందరూ ఒక కుటుంబంగా కలసి పని చేయాలి అనే నినాదంతో బయలు దేరిన యువ కెరటం.
జిల్లాలో యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పన, జిల్లా అభివృద్ధి లక్ష్యంగా ముందడుగు.
అక్కడి నుండి ఏలేశ్వరం మండలం,లింగపర్తి గ్రామంలో జ్యోతుల పెదబాబు ఇంటిలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎలేశ్వరం మండల పార్టీ అధ్యక్షుడు,ఆమండల సీనియర్ నాయకులను కలిసి నాయకుల అందరి ఇంటికి తాను వచ్చి కలుస్తాను అని తాను చెయ్యబోయే కార్యక్రమాన్ని వారికి వివరించి అనంతరం,ప్రత్తిపాడు నియోజకవర్గ ఇన్చార్జి వరుపుల సత్య ప్రభ రాజాను కలిసి తాను తీసుకున్న నిర్ణయాన్ని వివరించి ప్రత్తిపాడు మండల నాయకులను కలిసారు. ఈ సమావేశంలో ప్రత్తిపాడు, ఏలేశ్వరం,మండలపార్టీ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.










0 Comments