కోనసీమ జిల్లా, కొత్తపేట, సామాజిక స్పందన
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు గారు 73వ పుట్టినరోజు సందర్భంగా రాష్ట్ర టిడిపి ఉపాధ్యక్షులు కొత్తపేట నియోజకవర్గ పార్టీ ఇంచార్జ్ బండారు సత్యానందరావు ఆదేశాల మేరకు రావులపాలెం, మండలపార్టీ కార్యాలయం వద్ద శ్రీ నారా చంద్రబాబు నాయుడు పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు...
చంద్రబాబునాయుడు శత వసంతాలు జన్మదిన వేడుకలు జరుపుకోవాలని రావులపాలెం మండల నాయకులు ఆకాంక్షించారు.
అనంతరం మండల పార్టీ అధ్యక్షులు ఆధ్వర్యంలో కేక్ కటింగ్ జరిగింది.. అనంతరం రావులపాలెం గ్రామంలో గల శుభోదయం ఆంధ్రుల హాస్టల్ శ్రీ సత్య సాయి సేవ సమితి బ్రైట్ లైట్ ఆంధ్రుల వృద్ధుల అనాధ ఆశ్రమంలో ఉన్న వారందరికీ ఆహార పొట్లాలు అందజేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో రావులపాలెం మండల నాయకులు అధిక సంఖ్యలో వివిధ గ్రామాల నుంచి వచ్చిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మహిళలు అభిమానులు పాల్గొన్నారు.










0 Comments