ఎన్టీఆర్ జిల్లా, సామాజిక స్పందన
మండలంలోని అల్లూరు గ్రామంలో మంగళవారం ఉదయం "గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం"లో భాగంగా శాసనసభ్యులు డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు ప్రతి ఇంటికీ తిరుగుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను -పనితీరును వివరించారు ..
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత పాలకులు ఇచ్చిన వాగ్దానాలు విస్మరించి మోసం చేస్తే .. ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి మాత్రం ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చారని .. ఆ వివరాలతో ప్రజల ముందుకు సగర్వంగా వస్తున్నామన్నారు , గతంలో ఏ పాలకులు మీ కుటుంబానికి మేము చేసిన సాయం ఇది అని కరపత్రాలు ముద్రించి ఇచ్చిన దాఖలాలు లేవని -ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి మాత్రం మేము చేస్తున్న మంచిని -అందిస్తున్న పాలనను తెలిసేలా ప్రతి ఏటా కరపత్రాలు ముద్రించి మరీ ప్రజల ముందుకు పంపుతున్నారని తెలిపారు ,సంక్షేమ పథకాలు మాత్రమే కాదని అభివృద్ధి కూడా చేసి చూపుతున్నామని చెప్పారు, అభివృద్ధి- సంక్షేమమే ఎజెండాగా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పాలన సాగిస్తున్నారని గుర్తు చేశారు ,మహిళలకు నామినేటెడ్ పదవుల్లో 50% రిజర్వేషన్లు కల్పించడమే కాకుండా మహిళల రక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామన్నారు, మంచి మనసున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు ప్రతి ఒక్కరు అండగా నిలవాలని కోరారు ..
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బిందెల రాణి, ఎంపీపీ కోటేరు లక్ష్మీ ముత్తారెడ్డి, జడ్పిటిసి అమర్లపూడి సౌజన్య, షేక్ కార్పొరేషన్ డైరెక్టర్ షహనాజ్ బేగం, ఎంపీటీసీ బాయమ్మ, వైస్ ఎంపీపీ ఆదాం, మండల పార్టీ కన్వీనర్ ఆవుల రమేష్ బాబు, సొసైటీ మాజీ చైర్మన్ భాస్కర్ రెడ్డి, గ్రామ కన్వీనర్ రాజగోపాల్ రెడ్డి, కుంపటి శీను, వాలంటీర్లు ,సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ..
@@@@@ మరిన్ని వార్తలు చదవండి@@@@@@
అయ్యో.. పెళ్లైన ఏడాదికే ఆర్థిక సమస్యలతో దంపతుల ఇబ్బందులు.. చివరికి?
కడప, ఆంధ్రప్రదేశ్ ,సామాజిక స్పందన
పెళ్లైన కొన్నిరోజులకే భార్య లేదా భర్త ఎవరైన చనిపోతే ఆ కుటుంబ సభ్యు ఆవేదన వర్ణించలేనిది. అయితే కడప జిల్లాలోని ఓ జంట పెళ్లైన ఏడాదికే రైలు కింద పడి ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది.
పెళ్లైన కొన్నిరోజులకే భార్య లేదా భర్త ఎవరైన చనిపోతే ఆ కుటుంబ సభ్యు ఆవేదన వర్ణించలేనిది. అయితే కడప జిల్లాలోని ఓ జంట పెళ్లైన ఏడాదికే రైలు కింద పడి ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది. వివరాల్లోకి వెళ్తే కడపలోని విజయ దుర్గా కాలనీకి చెందిన సాయికుమార్ రెడ్డి, హేమమాలినీలకు ఏడాది క్రితం పెళ్లైంది. సాయి కుమార్ వ్యాపారాలు చేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. గత కొద్ది రోజులుగా భార్యభర్తలిద్దరు ఆర్థిక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. ఇంకో విషయం ఏంటంటే హేమమాలిని 8 నెలల గర్భవతి కూడా. ఇలాంటి సమయంలో ఆర్థిక సమస్యలు ఎక్కువ కావడంతో డిప్రెషన్ లోకి వెళ్లిపోయారు.
జీవితంపై విరక్తి పుట్టి ఇక చేసేదేం లేక మంగళవారం రోజున రాత్రి కడప శివారులోని కనుమలోపల్లికి చేరుకున్నారు. రైలు రావడం చూసి దానికింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. సమాచారం అందుకున్న కడప రైల్వే పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. అయితే దంపతుల మృతికి ఆర్థికపరమైన సమస్యలే కారణమా లేదా ఇతర కారణాలేమైన ఉన్నాయా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కడప ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి తరలించారు.











0 Comments