కాకినాడ జిల్లా పెద్దాపురం సామాజిక స్పందన
డా.బి.ఆర్. అంబేద్కర్ రచించిన మహొన్నతమైన భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవడమే తక్షణం మనముందు ఉన్న కర్తవ్యమని సిపిఎం మండల కార్యదర్శి నీలపాల సూరిబాబు అన్నారు. పెద్దాపురం మున్సిపల్ సెంటర్ లో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి సిపిఎం నాయకులు పూలమాలవేసి నివాళి అర్పించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ మేమంతా భారతీయులం అనే భావం రాజ్యాంగం కల్పించిందని అన్నారు. ప్రభుత్వరంగ సంస్ధలను అమ్మేస్తూ రాజ్యాంగానికి తూట్లు పొడిచారన్నారు. పరిశ్రమలు, భూమి ప్రభుత్వ ఆధీనంలో ఉండాలని రాజ్యాంగంలో పొందుపరిచారన్నారు. లౌకిక భారతాన్ని కాపాడుకోవడం నేడు మన ముందు ఉన్న కర్తవ్యమన్నారు. దీనికి ముందుగా యాసలపు సూర్యారావు భవన్ లో ఆర్దిక విధానాలు - సామాజిక న్యాయం అనే అంశం మీద సదస్సు జరిగింది.
కార్యక్రమంలో సిరిపురపు శ్రీనివాస్, కేదారి నాగు, సిఐటియు అధ్యక్ష, కార్యదర్శులు గడిగట్ల సత్తిబాబు, డి.క్రాంతి కుమార్, దాడి బేబి, పెయింటింగ్ యూనియన్ నాయకులు తైనాల శ్రీను, కరణం అప్పారావు, వడ్డి సత్యనారాయణ, అరుణ్, కృష్ణ, వీర్రాజు, సత్యనారాయణ, అప్పన్న, నరసింహమూర్తి తదిచరులు పాల్గోన్నారు.










0 Comments