బ్రేకింగ్ న్యూస్, చింతూరు మన్యంలో పులి సంచార జాడలు


అల్లూరి జిల్లా, చింతూరు, సామాజిక స్పందన

అల్లూరి జిల్లా చింతూరు మండలంలో పెద్దపులి సంచారం కలకలం రేపుతుంది.

పెద్దపులి సంచారాన్ని అటవీశాఖ అధికారులు అధికారింగా ధ్రువీకరించారు.


సుకుమామిడి గ్రామంలోని పంట పొలాల దగ్గర పులి జాడలు ఉన్నాయి.

మోతుగూడెం గ్రామానికి చెందిన నాగేశ్వరరావు అనే రైతుకు చెందిన దున్నపోతుని పులి చంపుకొని తిన్నట్లు ఆనవాళ్లు ఉండటంతో అటవీ శాఖ అధికారులు అలర్ట్ అయ్యారు.

 సుకుమామిడి గ్రామ పంట పొలాల్లో పెద్దపులి సంచరించినట్లు అధికారులు గుర్తించారు.

చింతూరు డీఎఫ్వో  పుష్ప సౌజన్య తన సిబ్బందితో దున్నపోతుని పెద్దపులి చంపి తిన్నట్లు గుర్తించారు.


 అడవిలో నిఘా కెమెరాలను అమర్చామని  ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.


@@@@@@ మరిన్ని వార్తలు చదవండి @@@@@@@


సీఎం కేసీఆర్‌ కుటుంబం ఆస్తి రూ.లక్ష కోట్లు: రేవంత్‌రెడ్డి సంచలన కామెంట్స్... 


హైదరాబాద్‌, సామాజిక స్పందన

 సీఎం కేసీఆర్‌ కుటుంబ ఆస్తి రూ.లక్ష కోట్లకు చేరిందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆరోపించారు. కేసీఆర్‌ కుటుంబ ఆస్తులపై ఒక్క కేసు అయినా పెట్టారా?


అని ప్రశ్నించారు. భాజపా, భారాస మధ్య సంబంధాలు ఉన్నాయనడానికి ఇదే నిదర్శనమన్నారు. సంబంధం లేకపోతే కేసీఆర్‌ ఆస్తులపై ఎందుకు విచారణ చేయట్లేదని ప్రశ్నించారు. కేసీఆర్‌ అవినీతిపై ఇప్పటి వరకు 50 ఫిర్యాదులు చేశానని.. ఒక్క దానిపై కూడా చర్యలు తీసుకోలేదన్నారు.


''రాష్ట్రంలో 80శాతం మంది కేసీఆర్‌కు వ్యతిరేకంగా ఉన్నారు. వీరిలో ఎక్కువ మంది కాంగ్రెస్‌ వైపు చూస్తున్నారు. ప్రజలు తమ వ్యూహాన్ని రూపొందించుకుంటున్నారు.. దానికి అనుగుణంగా రాజకీయ పార్టీలు అడుగులు వేస్తున్నాయి. పదేళ్లలో .. రాష్ట్రంలో భారాస, కేంద్రంలో భాజపా చేసిందేమిటో ప్రజలకు చెప్పగలరా? నీటిపారుదల విషయంలో కేసీఆర్‌ అబద్ధాలు చెబుతున్నారు. కాళేశ్వరం, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులను కాంగ్రెస్‌ పార్టీ మొదలు పెట్టింది. ఇప్పుడు దాన్ని కేసీఆర్‌ మార్కెటింగ్‌ చేసుకున్నారు. పాదయాత్రలో అనేక విషయాలు స్థానిక ప్రజలకు సవివరంగా చెప్పగలిగాం. ప్రజలు అడిగినవి పక్కనపెడితే.. కేసీఆర్‌ ఇచ్చిన హామీల్లో ఒక్కటైనా అమలు చేశారా? టీచర్‌ నియామకాలు చేపట్టారా? తెలంగాణ ప్రజలు స్వేచ్ఛ కోసం రాష్ట్రాన్ని సాధించుకున్నారు. ఇప్పుడు ఆ స్వేచ్ఛనే కేసీఆర్‌ గుంజుకున్నారు.


@@@@ మరిన్ని వార్తలు చదవండి@@@@@@@


సిక్కింలో భారీ హిమపాతం.. ఏడుగురి మృతి!

గాంగ్‌టక్‌, సామాజిక స్పందన

 సిక్కిం(Sikkim)లో భారీ హిమపాతం (Avalanche) సంభవించింది. ఇక్కడి నాథూలా (Nathu La) పర్వత లోయ ప్రాంతంలో మంగళవారం మధ్యాహ్నం చోటుచేసుకున్న ఈ దుర్ఘటనలో ఏడుగురు పర్యాటకులు మృతి చెందారు.

మరో 11 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం రాష్ట్ర రాజధాని గాంగ్‌టక్‌(Gangtok)కు తరలించారు. పదుల సంఖ్యలో పర్యాటకులు మంచు కింద చిక్కుకుపోయారు. ప్రమాద సమయంలో దాదాపు 150 మందికిపైగా పర్యాటకులు అక్కడున్నట్లు సమాచారం.


గాంగ్‌టక్‌ను, చైనా సరిహద్దు సమీపంలోని నాథులా పాస్‌(Nathu La Pass)ను కలిపే జవహార్‌లాల్‌ నెహ్రూ రోడ్డు మార్గంలో ఈ ఘటన చోటుచేసుకుంది. సరిహద్దు రహదారుల సంస్థ(BRO), సిక్కిం పోలీసులు, స్థానిక అధికారుల ఆధ్వర్యంలో సహాయక చర్యలు సాగుతున్నాయి. ఇప్పటివరకు 22 మందిని రక్షించినట్లు అధికారులు వెల్లడించారు. మంచు కారణంగా రోడ్డుపై వాహనాల్లో చిక్కుకుపోయిన 350 మంది పర్యాటకులనూ కాపాడినట్లు తెలిపారు.


Post a Comment

0 Comments

Latest News

Powered by Blogger.

Admin

Admin
Content published by Samajika Spandana.