ఆ ఇద్దరి వల్లే అంతా మరోసారి హరీష్‌రావు సంచలన వ్యాఖ్యలు.


సంగారెడ్డి, సామాజిక స్పందన

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై మంత్రి హరీష్‌రావు  మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇద్దరు నేతల వల్ల ఏపీ బొక్కబోర్లా పడిందని.. వాళ్ళది ప్రచారం ఎక్కువ.. మనది పని ఎక్కువ అని అన్నారు. గతంలో ఒకరు హైటెక్ పాలన అంటూ హడావుడి చేశారని... ఇప్పుడు ఏమైందని ప్రశ్నించారు. శనివారం సంగారెడ్డిలో దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన సుపరిపాలన దినోత్సవంలో మంత్రి పాల్గొని ఈ వ్యాఖ్యలు చేశారు. గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటకకు వెళ్లి చూస్తే తెలంగాణ గొప్పతనం తెలుస్తుందన్నారు. కేసీఆర్  తలయెత్తుకునేలా పాలన అందించారని గొప్పగా చెప్పుకొచ్చారు. కొత్త రాష్ట్రం అయినా సుపరిపాలన అందించారన్నారు. తెలంగాణ పథకాలను కేంద్రం కాపీ కొడుతోందని తెలిపారు. కేంద్ర, అన్ని రాష్ట్రాల ఉద్యోగుల వేతనాల కంటే ఎక్కువ వేతనాలు పొందుతున్నది తెలంగాణ ఉద్యోగులే అని పేర్కొన్నారు. తెలంగాణ చేస్తున్న మంచి పనులు చూసి కేంద్రం తట్టుకోలేకపోతుందని మంత్రి విమర్శించారు.

రాష్ట్రానికి హక్కుగా రావాల్సిన లక్షా 30 వేల కోట్లు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారన్నారు. కాంగ్రెస్ వస్తే దళారి వ్యవస్థ వస్తుందని.. కేసీఆర్‌ర్ నిరంతరం ప్రజల కోసం ఆలోచిస్తారని చెప్పారు. తెలంగాణ వస్తే నక్షలైట్ల రాజ్యం వస్తుందని.. హైదరాబాద్‌లో కర్ఫ్యూ ఉంటుందని.. అంతా చీకటేనని చాలా మంది చెప్పారని గుర్తుచేశారు. ఈ 9 ఏళ్లలో అది నిజం కాదని కేసీఆర్ చేసి చూపెట్టారన్నారు. దేశానికి తెలంగాణ రోల్ మోడల్ గా నిలిచిందని.. కేంద్రమే తెలంగాణకి అవార్డులు ఇస్తుందన్నారు. రాష్ట్ర ఏర్పాటును అడ్డుకున్న వ్యతిరేక శక్తులకు ఇది చెంపపెట్టన్నారు. తెలంగాణ విభజనని వ్యతిరేకించి తప్పు పని చేశానని లగడపాటి అన్నట్టు గుర్తు అని... ప్రస్తుతం ఆయన రాజకీయాల్లో లేరన్నారు. నవ్విన చోటే నాప పండు పండించినట్టు కేసీఆర్ తల ఎత్తుకునేలా చేశారని చెప్పుకొచ్చారు. కేంద్రం మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ పథకాలను కాపీ కొట్టి పేర్లు మార్చుకుందని ఆయన వ్యాఖ్యలు చేశారు.


‘‘మనం ఆడిట్ బాగా చేస్తున్నామని మన దగ్గర ఉన్న ఆడిట్ డైరెక్టర్‌ను ఢిల్లీకి పిలుచుకున్నారని’’ అన్నారు. తెలంగాణలో సర్పంచులు అందరూ ఓ బస్సులో గుజరాత్, మహారాష్ట్ర వెళ్లి అక్కడ అభివృద్ధి ఎలా ఉందో చూడాలన్నారు. డబుల్ ఇంజిన్ సర్కార్ పనితనానికి.. బీఆర్‌ఎస్ మోడల్ సర్కార్ పనితనానికి తేడా తెలుస్తుందన్నారు. ‘‘అస్సాం ముఖ్యమంత్రి స్వయంగా కరెంట్ సరిపోవట్లేదు కరెంట్ పొదుపుగా వాడాలని చెప్పారు. మనకి ఢిల్లీల అవార్డులు ఇస్తారు.. గల్లీల తిడుతారు. ధరణి వల్లే రైతుల సమస్య పరిష్కారం అయ్యింది. ధరణి రాకముందు రైతుల కష్టం అంతా ఇంతా కాదు. ధరణి తీసేయాలని కాంగ్రెస్ చెబుతుంది. ధరణి తీసేస్తే.. కాంగ్రెస్ కార్యకర్తలకే రైతు బంధు ఇస్తారు. నిజాలను ప్రచారంలో పెట్టాల్సిన బాధ్యత మనపై ఉంది. కాంగ్రెస్ వాళ్లు మళ్ళీ వస్తే దళారీ వ్యవస్థ రాజ్యామేలుతుంది. తెలంగాణ దేశానికి దిక్సుచిగా నిలవాలంటే మూడోసారి కేసీఆర్ రావాలి’’ అని మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు..


 @@@@@@@@ మరిన్ని వార్తలు@@@@@@@@


ఏపీ రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ  ఆధ్వర్యంలో రాహుల్ తైక్వాండో క్లబ్ తైక్వాండో క్రీడాశిక్షణా శిబిరం ప్రారంభం


కాకినాడ, సామాజిక స్పందన

వివేకానంద పార్కులో రాహుల్ తైక్యాండో క్లబ్ చే నిర్వహించే వేసవి శిక్షణా శిబిరం సెంట్రజ్ స్పోర్ట్సు సిఇవో ఇమ్రాన్ షేక్  ప్రారంభించారు. డిస్ట్రిక్ట్ ఒలింపిక్ అసోషియేషన్ సెక్రటరీ పద్మనాభం,పిఇటి సంఘం సెక్రటరీ నూకరాజు,పిఇటి  సంఘం ప్రెసిడెంట్ రవి రాజు  పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యఅతిధి ఇమ్రాన్ షేక్  మాట్లాడుతూ తైక్వాండో తో

యువతకు, విద్యార్థులకు మానసిక, శారీరక ఆరోగ్యం పెంపొండుతుందన్నారు.అనంతరం పద్మనాభం  మాట్లాడుతూ ఈశిక్షణా శిబిరాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు.నూకరాజు మాట్లాడుతూ ఈ తైక్వాండో సర్టిఫికెట్స్ వలన విద్యా, ఉద్యోగలకు ఉయోగపడతాయని తెలిపారు.రవిరాజు జిల్లా తైక్వాండో  అసోషియోషన్ సెక్రటరీ అర్జున్ రావులు మాట్లాడుతూ ఈ శిక్షణ అనంతరం ప్రాక్టీస్ చేస్తూ జాతీయ,అంతర్జాతీయ స్థాయిలో మంచి మంచి పతకాలు,సర్టిఫికెట్స్  సంపాదించుకోవాలని ఆకాంక్షించారు.

జిల్లా తైక్వాండో లో బ్లాక్ బెల్టు,సర్టిఫికెట్లు సంపాధించిన విద్యార్థులను  అభినందించారు. జిల్లా తైక్వాండో సీనియర్ కోచ్ డిఎన్ ఎస్ మూర్తి  ఈ ప్రారంభోత్సవానికి విచ్చేసిన అతిధులకు, ధన్యవాదములు తెలుపుతూ ఈ వేసవి శిక్షణా శిబిరాన్ని అందరూ వినియోగించు కోవాలని కోరారు.



ఎయిమ్స్ ఆస్పత్రిలో చేరిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి


దిల్లీ, సామాజిక స్పందన

బీజేపీ నేత, కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డికి అస్వస్థత కలిగింది. ఆదివారం రాత్రి ఆయనకు ఛాతీలో నొప్పి రావడంతో.. 

ఆయన్ని ఢిల్లీ ఎయిమ్స్ హస్పిటల్లో చేర్పించారు..

కార్డియాక్ కేర్ యూనిట్ లో ప్రత్యేక డాక్టర్ల టీమ్ ఆయన్నీ పర్యవేక్షించింది..

అయితే కడుపులో గ్యాస్ సమస్య వల్ల ఆయనకు ఛాతీ నొప్పి వచ్చినట్లు తెలుస్తోంది. 

అందువల్ల ఆందోళన చెందాల్సిన అవసరం లేదనీ.. ఎలాంటి ఇబ్బందీ లేదని ఆయన సన్నిహితులు చెబుతున్నారు.


    @@@@@@@ మరిన్ని వార్తలు @@@@@@@



 రాబోయే రెండురోజులు ఏపీలో పిడుగులతో కూడిన భారీవర్షాలు.

తెలుగు రాష్ట్రాలు వర్షాలతో అల్లాడిపోతున్నాయి.

మండు వేసవిలో అకాల వర్షాలు, పిడుగులు అన్నదాతల పాలిట శాపంగా మారాయి. ఐఎండి అంచనా ప్రకారం తూర్పు విదర్భ నుండి ఉత్తర తమిళనాడు వరకు తెలంగాణ మరియు కర్ణాటక మీదుగా ద్రోణి కొనసాగుతుందని విపత్తుల సంస్థ ఎండి డా. బిఆర్ అంబేద్కర్ వెల్లడించారు. దీని ప్రభావంతో రాష్ట్రంలో మరో రెండు రోజులు పిడుగులతో కూడి అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు తెలిపారు.ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు..


సోమవారం కోనసీమ,పల్నాడు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, వైఎస్‌ఆర్‌, శ్రీసత్యసాయి, అనంతపురం, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మిగిలిన జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. 


ఎల్లుండి పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, తూర్పుగోదావరి, కోనసీమ, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ప్రకాశం, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, వైఎస్‌ఆర్‌, శ్రీసత్యసాయి, అనంతపురం,కర్నూలు, నంద్యాల జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.




Post a Comment

0 Comments

Latest News

Powered by Blogger.

Admin

Admin
Content published by Samajika Spandana.