ఇక కురుక్షత్ర యుద్ధం స్టార్ట్..చంద్రబాబు నాయుడు



ఆంధ్రప్రదేశ్, సామాజిక స్పందన

సోమవారం అమరావతిలో టీడీపీ విస్తృతస్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న టీడీపీ అధినేత చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు..

ఏపీలో ప్రస్తుతం భయంకరమైన వాతావరణం నెలకొందన్న చంద్రబాబు ..వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రంలో ఏడుసార్లు కరెంట్ ఛార్జీలు పెంచిన విషయాన్ని గుర్తు చేశారు. ఇక్కడ స్వేచ్ఛగా మాట్లాడితే తప్పుడు కేసులు, ఆస్తుల జప్తు చేస్తున్నారని మండిపడ్డారు. నాసిరకం మందుతో పేదప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని అన్నారు. 

ఇక రాష్ట్రంలో 175కి 175 సీట్లు గెలవాలని టీడీపీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఈరోజు నుండి కురుక్షేత్ర యుద్ధం మొదలు కానుందని..కౌరవ వధతో మళ్లీ అధికారంలోకి వచ్చి సీఎం అయ్యాకే అసెంబ్లీలో అడుగుపెడతానన్న మాటలను చంద్రబాబు  గుర్తు చేశారు. ఇక రాష్ట్రంలో భూముల విలువ భారీగా పడిపోయిందని..పొరుగు రాష్ట్రం తెలంగాణలో ఎకరం అమ్మితే ఇక్కడ 100 ఎకరాలు కొనుగోలు చేయొచ్చని చంద్రబాబు అన్నారు..

ఏపీలో నేరస్థుల పాలన కొనసాగుతుందని..మనస్సాక్షి లేని వ్యక్తి సీఎం జగన్ అని చంద్రబాబు మండిపడ్డారు. గుడివాడలో నాలుగేళ్ల తరువాత టిడ్కొ ఇళ్లను పంపిణీ చేశారని..ఎవరికో పుట్టిన బిడ్డను తన బిడ్డ అని చెప్పుకునే వ్యక్తి సీఎం జగన్ అని బాబు  ఫైర్ అయ్యారు..

అలాగే తిరుమల శ్రీవాణి ట్రస్టుపై చంద్రబాబు  మండిపడ్డారు. తిరుమల శ్రీవారి ట్రస్టు నిర్వహించేది ఎవరని ప్రశ్నించిన బాబు..తిరుమల వెంకన్నకు అపచారం తలపెడుతున్నామన్నారన్నారు. శ్రీవాణి టికెట్లకు రిసీట్లు ఇవ్వడం లేదని..ఆ డబ్బులు ఎక్కడికి పోతున్నాయని ప్రశ్నించారు. వెంకన్న జోలికి వస్తే వచ్చే జన్మలో కాదు..ఈ జన్మలోనే శిక్ష పడుతుందని చంద్రబాబు అన్నారు..


Post a Comment

0 Comments

Latest News

Powered by Blogger.

Admin

Admin
Content published by Samajika Spandana.