హైదరాబాద్, సామాజిక స్పందన
తెలంగాణలో ప్రవేశ పెట్టిన ధరణి పోర్టల్ రాష్ట్ర ప్రజలకు జీవన్మరణ సమస్యగా పరిణమించిందని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు..
ధరణిని అడ్డుపెట్టుకుని అధికార పార్టీ నాయకుల సహకారంతో కొందరు అక్రమార్కులు భూకుంభకోణాలకు పాల్పడుతున్నట్లు ఇటీవల ఆరోపించిన రేవంత్ రెడ్డి.. తాజాగా ధరణి పుట్టుక దగ్గర నుంచి దాన్ని ఏ విధంగా ప్రయివేటు సంస్థకు అప్పగించారు? తద్వారా ప్రజలకు కలుగుతున్న తీవ్ర నష్టం ఏమిటి? అనే తదితర అంశాలను వివరించారు. కేసీఆర్, కేటీఆర్ ఇద్దరూ సైబర్ నేరగాళ్ల మాదిరిగా ధరణి పేరుతో తెలంగాణ ప్రజల సొమ్మును దోచుకుంటున్నారని రేవంత్ ఆరోపించారు. ధరణి పోర్టల్ వెనకాల దొరలు, రాజులు ఉన్నారని, కేసీఆర్ దోపిడీ, దొంగతనాలకు అడ్డు అదుపు లేకుండా పోయిందని ధ్వజమెత్తారు..
Ads by SRAMN DIGITAL
if you want to change your life then take this Digital marketing course by helloveeru 🤝
👉👉👉👉 Course buy link👈👈👈👈
Choose your career in digital marketing..
ప్రభుత్వం దగ్గర ఉండాల్సిన రెవెన్యూ రికార్డులను ధరణి పేరుతో పూర్తిగా ప్రయివేటు కంపెనీ ఐఎల్ అండ్ ఎఫ్ఎస్‌కు కట్టబెట్టారని రేవంత్ మండిపడ్డారు. రూ.90 వేల కోట్లు అప్పు తీసుకుని వివిధ బ్యాంకులను నిండా ముంచి, దివాలా తీసిన కంపెనీతో రాష్ట్ర ప్రభుత్వం ఏవిధంగా ఒప్పందం చేసుకుంటుందని ప్రశ్నించారు. ఐఎల్ అండ్ ఎఫ్ఎస్ కంపెనీకి చెందిన ధరణి నిర్వహిస్తున్న టెర్రాసిస్ టెక్నాలజీస్ లిమిటెడ్ 52.26 శాతం వాటాను ఫిలిప్పీన్స్ దేశానికి చెందిన ఫాల్కన్ కంపెనీకి రూ.1,275 కోట్లకు అమ్ముకుందని ఆరోపించారు. ఇప్పుడు టెర్రాసిస్ కంపెనీ 99 శాతం వాటా ఫాల్కన్ కంపెనీకి ఇచ్చేసిందన్నారు. ఇప్పుడు ధరణి పోర్టల్ పూర్తిగా శ్రీధర్ రాజు చేతుల్లోకి వెళ్లిపోయిందని ఆరోపించిన రేవంత్ రెడ్డి.. 75 ఏళ్లలో ఏ రాజకీయ పార్టీ, నాయకుడు కేసీఆర్ మాదిరిగా దోపిడీకి పాల్పడలేదని ధ్వజమెత్తారు..

.jpeg)









0 Comments