ఆంధ్రప్రదేశ్, సామాజిక స్పందన
చంద్రబాబు గత రెండు నెలల క్రితం స్కిల్ స్కాం కేసులో అరెస్ట్ అయ్యి రిమాండ్ కు వెళ్లి ఇప్పుడు బెయిల్ మీద రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఈ కేసులో కోర్టులు ఏ విధమైన తీర్పులను ప్రకటించలేదని తెలిసిందే..
ఈ రోజు జరిగిన కోర్ట్ విచారణలో చంద్రబాబు తరపున లాయర్లు ఆయన ఆరోగ్యానికి సంబంధించి కొన్ని వివరాలను సమర్పించారు. ఇటీవల చంద్రబాబు కుడికంటికి శాస్త్ర చికిత్స చేసిన సంగతి తెలిసిందే.. ఆ వివరాలను మరియు చంద్రబాబు గుండెకు సంబంధించిన కొత్త సమస్యను కోర్ట్ దృష్టికి తీసుకెళ్లారు లాయర్లు. లాయర్లు తెలిపిన సమాచారం ప్రకారం చంద్రబాబు గుండెకు సంబంధించిన సమస్యతో బాధపడుతున్నారని, గుండె పరిమాణం పెరిగిందని.. తద్వారా గుండెకు రక్తం సరఫరా చేసే రక్త నాళాల్లో సమస్యలు ఉన్నాయని తెలిపింది. అందువలన చంద్రబాబుకు తగిన విశ్రాంతి అవసరం అని డాక్టర్లు సూచించారంటూ కోర్టుకు లాయర్లు తెలిపారు..
ఈ విషయం తెలిసిన చంద్రబాబు అభిమానులు కంగారు మరియు బాధలో ఉన్నారు. దీనిపై హై కోర్ట్ ఏమని స్పందిస్తుంది అన్నది తెలియాల్సి ఉంది..
ఢిల్లీ-దర్భంగా సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌లో మంటలు, రైలు నుంచి దూకేసిన ప్రయాణికులు..
ఉత్తరప్రదేశ్, సామాజిక స్పందన
ఉత్తర్ ప్రదేశ్‌లోని ఓ ఎక్స్‌ప్రెస్ ట్రైన్‌లో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ప్రాణ భయంతో ట్రైన్ లో నుంచి బయటకి దూకేశారు..
ఈ ఘటనలో ఓ స్లీపర్ కోచ్ పూర్తిగా కాలిపోయినట్లు తెలుస్తోంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఢిల్లీ - దర్భంగా సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ ఉత్తర్ ప్రదేశ్‌లోని సరాయ్ భూపత్ స్టేషన్ గుండా వెళ్తుండగా అకస్మాత్తుగా ఓ స్లీపర్ బోగీలో మంటలు చెలరేగాయి..
స్టేషన్ మాస్టర్ మంటల్ని గమనించి రైల్వే సిబ్బందికి సమాచారం అందించాడు. అప్రమత్తమైన అధికారులు ఇటావాలో ట్రైన్ ని నిలిపేశారు. అప్పటికే కోచ్ మొత్తానికి మంటలు అంటుకున్నాయి..
ప్రాణ భయంతో ప్రయాణికులు వెంటనే అందులోంచి బయటకి దూకేశారు. చిక్కుకున్న వారిని సహాయక సిబ్బంది బయటకి తీశారు. ఈ ప్రమాదంలో ఎవరూ గాయపడలేదని అధికారులు తెలిపారు..
రైలులో సామర్థ్యానికిమించి ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. అగ్నిమాపకదళ సిబ్బంది మంటల్ని అదుపులోకి తీసుకువచ్చారు. అయితే ఘటనకు కారణాలేంటో ఇంకా తెలియరాలేదు. భారతీయ రైల్వే శాఖలో వరుసగా జరుగుతున్న ప్రమాదాలు ట్రైన్ జర్నీ భద్రతపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి..











0 Comments