ఉత్తర్‌కాశీ టన్నెల్‌ ఘటనపై మాకు ఎలాంటి సంబంధం లేదు అన్న ఆదా నీ గ్రూప్


ఉత్తరాఖండ్‌, అహ్మదాబాద్, సామాజిక స్పందన

 ఉత్తరాఖండ్‌ లోని ఉత్తర్‌కాశిలో నిర్మాణంలో ఉన్న సొరంగం లో కొంతభాగం కుప్పకూలి 41 మంది కార్మికులు గత 16 రోజులుగా చిక్కుకుపోయిన ఘటనలో తమ ప్రమేయాన్ని అదానీ గ్రూప్  సోమవారంనాడు తోసిపుచ్చింది..


ఉత్తరాఖండ్ సొరంగం నిర్మాణంలో తమకు ఎలాంటి ప్రమేయం లేదని వివరణ ఇచ్చింది. ఈ ఘటనను తమ గ్రూప్‌తో ముడిపెట్టేందుకు జరుగుతున్న ప్రయత్నాలను తీవ్రంగా ఖండిస్తున్నట్టు తెలిపింది. ఉత్తరాఖండ్ సొరంగం నిర్మాణంలో అదానీ గ్రూప్‌, దాని అనుబంధ సంస్థలకు ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కానీ ఎలాంటి ప్రమేయం లేదని వివరించింది..


''ఉత్తరాఖండ్‌లో నిర్మాణంలో ఉన్న సొరంగం కుప్పకూలడం దురదృష్టకరం. ఈ ఘటనకు మా సంస్థతో ముడిపెట్టేందుకు కొన్ని శక్తులు ప్రయత్నిస్తున్నాయి. ఈ టన్నెల్‌ను నవయుగ ఇంజనీరింగ్ కంపెనీ నిర్మించింది. ఆ సంస్థతో మాకు ఎలాంటి సంబంధం లేదు. అందులో మాకు షేర్లు కూడా లేవు'' అని అదాని గ్రూప్ ప్రతినిధి ఒక ప్రకటనలో తెలిపారు. సొరంగంలో చిక్కుకున్న కార్మికులు, వారి కుటుంబాలకు మంచి జరగాలని తాము ప్రార్థిస్తున్నట్టు ఆయన తెలిపారు. నవంబర్ 12న నిర్మాణంలో ఉన్న టన్నెల్‌లో కొంత భాగం కుప్పకూలడంతో అందులో 41 మంది కార్మికులు చిక్కుకుపోయారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వీరిని సురక్షితంగా బయటకు తెచ్చేందుకు అన్నిరకాలుగా ప్రయత్నాలు చేస్తున్నాయి. ఆర్మీ కూడా రంగంలోకి దిగింది..


@@@@@@ మరిన్ని వార్తలు చదవండి @@@@@@


 ప్రజలకు మంచి చేసి చంద్రబాబు ఎప్పుడూ సీఎం కాలేదు, అంటూ సీఎం జగన్‌ సంచలన వ్యాఖ్యలు.


ఏలూరు, సామాజిక స్పందన

 చంద్రబాబు పాలనలో అన్ని వర్గాలను మోసం చేశారని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ధ్వజమెత్తారు. బాబు సీఎంగా ఉన్నప్పుడు అంతా దోపిడినే జరిగిందని మండిపడ్డారు..


కాలేదని అన్నారు. తొలిసారి వెన్నుపోటుతో, రెండోసారి కార్గిల్‌ యుద్ధం పుణ్యాన, మూడోసారి రుణమాఫీతో అధికారంలోకి వచ్చారని ప్రస్తావించారు..


త్వరలో ఎన్నికలు జరగబోతున్నాయన్న సీఎం జగన్‌.. చంద్రబాబుకు మిగతా సామాజిక వర్గాలపై ఎలాంటి అభిప్రాయం ఉందో గుర్తు తెచ్చుకోవాలని ప్రజలకు సూచించారు. ఎస్సీలో ఎవరైనా పుట్టాలనుకుంటారా, బీసీల తోకలు కత్తిరిస్తానని చంద్రబాబు చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. ఇచ్చిన మేనిఫెస్టోలపై కమిట్‌మెంట్‌ లేని నాయకుడు చంద్రబాబు అని విమర్శించారు..


ఎన్నికలు దగ్గరవుతున్న కొద్దీ తోడేళ్లంతా ఏకమవుతున్నారని సీఎం జగన్‌ మండిపడ్డారు. దొంగల ముఠా అంతా ఏకమై ప్రతి ఇంటికి బెంజ్‌ కారు ఇస్తామంటారు.. నమ్మి మోసపోవద్దని హితవు పలికారు. 2014 చంద్రబాబు, పవన్‌ ఏకమై ఇచ్చిన హామీలు నెరవేర్చారా అని ఆలోచించాలని సూచించారు. తనకు ప్రజా దీవెనలు ఉన్నంత వరకు ఎవరితోనూ పొత్తు పెట్టుకోనని స్పష్టం చేశారు..


సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం ఏలూరు జిల్లా నూజివీడులో నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 46,463.82 ఎకరాలను వ్యవసాయం కోసం కొత్తగా 42,307 మందికి డీకేటీ పట్టాలు పంపిణీ చేశారు. నిరుపేదలకు భూముల పంపిణీని ప్రారంభించడంతోపాటు అసైన్డ్‌ భూములకు యాజమాన్య హక్కులు కల్పించడం, లంక భూములకు పట్టాలు అందజేశారు..

Post a Comment

0 Comments

Latest News

Powered by Blogger.

Admin

Admin
Content published by Samajika Spandana.