ఏపీలో గంజాయి మినహా అన్నీ సంక్షోభంలోన అంటూ చంద్రబాబు కీలక వ్యాఖ్యలు


మరావతి, సామాజిక స్పందన

 సీఎం జగన్‌ అధికార వ్యామోహం రాష్ట్రానికి శాపంగా మారిందని తెదేపా అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యవస్థలను చంపేసి రివర్స్‌గేర్‌లో నడిపిస్తున్నారని మండిపడ్డారు..


అమరావతిలోని తెదేపా కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో చంద్రబాబు మాట్లాడారు. రాష్ట్రంలో సంక్షోభానికి కారణమైన జగన్‌కు పరిపాలించే అర్హత ఎక్కడిదని నిలదీశారు. 


93 శాతం రైతులు అప్పుల్లో..


''రాష్ట్రంలో గంజాయి పంట మినహా అన్నీ సంక్షోభంలో ఉన్నాయి. సమస్యలు చెబితే రైతులపై మంత్రి అనుచిత వ్యాఖ్యలు చేస్తారు. జగన్‌ పాలనలో అద్భుతంగా సాగయ్యే పంట గంజాయే. ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో రైతులు టమాటా వేయడం మానేశారు. ఇప్పుడు టమాటా ధరలు పెరగడానికి ఇదే కారణం. ముందు చూపుతో వ్యవహరిస్తే ఈ తిప్పలు ఉండేవి కావు. కరోనా సమయంలో రైతు ఒక్కడే బయటకొచ్చి దేశానికి అన్నం పెట్టాడు. రాష్ట్రంలో ప్రస్తుతం 93శాతం మంది రైతులు అప్పులపాలయ్యారు. రైతుపై సగటు అప్పు రూ.2.45లక్షలపైనే ఉంది. తప్పుడు లెక్కలు చూపించడంలో జగన్‌ సిద్ధహస్తుడు..


దోపిడీ కేంద్రాలుగా ఆర్బీకేలు..


తెదేపా హయాంలో రాయలసీమలో హార్టికల్చర్‌.. కోస్తాలో ఆక్వాకల్చర్‌కు ప్రాధాన్యమిచ్చాం. ఇప్పుడు ఆ రెండూ సంక్షోభంలో ఉన్నాయి. ఏపీలో భూముల ధరలు, వ్యవసాయంపై తెలంగాణ సీఎం కేసీఆర్‌ కామెంట్లు చేస్తున్నారు. వరి రైతుకు గిట్టుబాటు ధర లేదు. ఆర్బీకేలు దోపిడీ కేంద్రాలుగా మారాయి. రైతులపై వైకాపా ప్రభుత్వం అప్పుల భారం మోపింది. జగన్‌ మాత్రం విలాసవంతమైన జీవితం గడుపుతున్నారు. 


రైతుల భూమి దానం చేసిన జగన్‌ దానకర్ణుడా?


రాష్ట్రంలో భూసార పరీక్షలు లేకపోవడంతో పంట దిగుబడి తగ్గింది. నీటి సెస్సు వెయ్యి లీటర్లకు రూ.12 నుంచి రూ.120 చేశారు. కృష్ణా-గోదావరి నదులున్న ఈ రాష్ట్రంలో నీటిపై విపరీతమైన సెస్సులా? రాజధాని రైతుల భూమి వేరొకరికి దానం చేసిన జగన్‌ దానకర్ణుడా? అంత దానం చేసే గుణమే ఉంటే తన భూమి ఇవ్వొచ్చుగా?ఆర్‌-5జోన్‌లో ఇళ్ల నిర్మాణానికి కోర్టు అనుమతి వచ్చిందా? ఏపీ రాజధాని ఏదంటే ఏం చెప్పాలో తెలియని పరిస్థితి. అమరావతి రైతులపై జగన్‌కు ఎందుకంత కక్ష?''అని చంద్రబాబు మండిపడ్డారు.

Post a Comment

0 Comments

Latest News

Powered by Blogger.

Admin

Admin
Content published by Samajika Spandana.