అమరావతి, సామాజిక స్పందన
బైజూస్‌ను చూపించి రాష్ట్ర ప్రభుత్వం మోసం చేస్తోందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. బైజూస్ ద్వారా ఏదో సాధించామని ప్రభుత్వం చెబుతోందన్నారు..
ఆర్భాటాలు కాదు.. ముందు పాఠశాలల్లో మరుగుదొడ్లు నిర్మించాలని పవన్ సూచించారు. ''మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ఊసే లేదు. ఉపాధ్యాయుల భర్తీ చేపట్టలేదు.
వారికి శిక్షణ ఇవ్వడం లేదు. నష్టాలు వచ్చే స్టార్టప్‌కు మాత్రం రూ.కోట్ల కాంట్రాక్టు ఇచ్చారు. టెండర్ కోసం ఎన్ని కంపెనీలు దరఖాస్తు చేశాయి? టెండర్ల ప్రక్రియలో ప్రమాణాలను ప్రభుత్వం పాటించిందా? ఆ కంపెనీలను ఎవరు పరిశీలించారు?వాటికి సంబంధించిన వివరాలు ఆన్‌లైన్‌లో ఉంచారా? టెండరు, కంపెనీ ఎంపిక అంశాలపై ప్రభుత్వం స్పందించాలి'' అని పవన్ కల్యాణ్ డిమాండ్ చేశారు..
భారీ వర్షాలపై మంత్రులు, అధికారులతో సీఎం కేసీఆర్ సమీక్ష
హైదరాబాద్, సామాజిక స్పందన
రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలు సహా, వివిధ అంశాలపై సచివాలయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. మంత్రులు హరీశ్‌రావు, గంగుల కమలాకర్, జగదీశ్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారిసహా వివిధశాఖల ఉన్నతాధికారులు సమీక్షలో పాల్గొన్నారు..
గత కొన్ని రోజలుగా రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో సహాయక చర్యలపై సీఎం సమీక్షించారు. ప్రధానంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లోని గోదావరి పరివాహక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండటంతో ఆయా ప్రాంతాల్లో పరిస్థితిపై అధికారులతో సీఎం చర్చించారు. ఇప్పటికే ఖమ్మం జిల్లాకు చెందిన మంత్రి పువ్వాడ అజయ్‌తో ఫోన్‌లో మాట్లాడిన సీఎం.. భద్రాచలం వద్ద పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. వరద పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. ధాన్యం ఉత్పత్తి మేరకు ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల ఏర్పాటుపై కూడా సీఎం చర్చించారు..











0 Comments