కాకినాడ జిల్లా, సామాజిక స్పందన
కాకినాడ లో ప్రతి మంగళవారం నిర్వహిస్తున్న డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమంలో నమోదు అయిన వినతులను నిర్ణీత సమయంలో పరిష్కారించాలని జిల్లా కలెక్టర్ డా. కృతికాశుక్లా అధికారులను ఆదేశించారు. కాకినాడ కలెక్టరు కార్యాలయంలో మంగళవారం ఉదయం 10:30 గంటల నుంచి 11.30 గంటల వరకు జిల్లా కలెక్టరు డా. కృతికా శుక్లా డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లాల్లో వివిధ మండలాల నుంచి 16 మంది.. విద్య, ఉపాధి, భూ సర్వే, భూ సమస్యలు, డ్రైనేజీ, సీసీ రోడ్లు, వీధి లైట్లు, వంటి సమస్యలపై టోల్ ఫ్రీ నెంబర్ 18004253077కు ఫోన్ చేసి జిల్లా కలెక్టరుకు నేరుగా తెలియజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టరు కృతికాశుక్లా మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో సమస్యల్ని ప్రజలు నుంచి నేరుగా తెలుసుకునేందుకు డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందన్నారు. ఫోన్ ద్వారా తెలియజేసిన 16మంది వ్యక్తుల సమస్యల పరిష్కారం నిమిత్తం సంబంధిత శాఖల అధికారులకు పంపించడం జరిగిందన్నారు. అధికారులు డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమంలో నమోదైన సమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టి నిర్ణీత గడువులోగా పరిష్కారించాలని కలెక్టరు కృతికా శుక్లా అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో ఇంచార్జ్ డీఆర్వో కె.శ్రీరమణి, కలెక్టరేట్ ఏవో జీఎస్ఎస్ శ్రీనివాసు, వివిధ సెక్షన్ల అధికారులు తదితరులు పాల్గొన్నారు.











0 Comments