ప్రధాని మోదీకి అరుదైన గౌరవం. ఫ్రాన్స్‌ అత్యున్నత అవార్డుతో సత్కారం.

 


పారిస్‌, సామాజిక స్పందన

 ఫ్రాన్స్‌ పర్యటనలో ఉన్న భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీకి అరుదైన గౌరవం లభించింది. ఆతిథ్య దేశ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్‌ మేక్రాన్‌.. మోదీని 'గ్రాండ్‌ క్రాస్‌ ఆఫ్‌ ది లీజియన్‌ ఆఫ్‌ ఆన్‌ర్‌' పురస్కారంతో సత్కరించారు..

ఫ్రాన్స్‌ అత్యున్నత పౌర, సైనిక పురస్కారాన్ని అందుకున్న తొలి భారత ప్రధాని మోదీనే కావడం విశేషం.

గురువారం ఎలీసీ ప్యాలెస్‌లో జరిగిన కార్యక్రమంలో అధ్యక్షుడు మేక్రాన్‌.. మోదీకి ఈ పురస్కారం అందజేశారు. ఇప్పటివరకు దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు నెల్సన్‌ మండేలా, బ్రిటన్‌ రాజు కింగ్‌ ఛార్లెస్‌, జర్మనీ మాజీ ఛాన్సలర్‌ ఏంజెలా మెర్కెల్‌, ఐక్యరాజ్యసమితి మాజీ సెక్రటరీ జనరల్‌ బుట్రోస్‌ బుట్రోస్‌ ఘలి వంటి వారు ఈ అవార్డును అందుకున్నారు. ఇప్పుడు వారి సరసన మోదీ చేరారు..


 జపాన్‌ అంతరిక్ష కార్యక్రమానికి ఎదురు దెబ్బ

జపాన్, సామాజిక స్పందన.

జపాన్‌ అంతరిక్షకార్యక్రమానికి భారీ ఎదురు దెబ్బ తగిలింది. ఆ దేశం అభివృద్ధి చేస్తున్న రాకెట్‌ ఇంజిన్‌ పరీక్షల సమయంలో పేలిపోయింది..

ఈ ప్రమాదం శుక్రవారం చోటు చేసుకొంది. ఈ విషయాన్ని ఆ దేశ స్పేస్‌ ఏజెన్సీ వెల్లడించింది. గతంలో ఉపయోగించిన ఎప్సిలాన్‌ రాకెట్‌ను అభివృద్ధి చేసి ది ఎప్సిలాన్‌-ఎస్‌ పేరిట సిద్ధం చేసింది. తాజాగా అదే ప్రమాదానికి గురైంది.

గత అక్టోబర్‌లో ఘన ఇంధనం ఆధారంగా పనిచేసే ఎప్సిలాన్‌ను ప్రయోగించింది. అప్పట్లో ఆ ప్రయోగం విఫలమైంది. తాజా మార్పులతో పరీక్షించగా.. ప్రయోగం మొదలైన 50 సెకన్లలో విఫలమైంది. ఈ పరీక్షా కేంద్రం ఉత్తర అకితా ప్రాంతంలో ఉంది. ఈ ప్రాంతం భారీ ఎత్తున మంటలు, పొగలతో నిండిపోయింది. దీనికి సంబంధించిన చిత్రాలను జాతీయ మీడియా సంస్థ ఎన్‌హెచ్‌కే ప్రసారం చేసింది. ఈ ఘటనలో ఇప్పటి వరకు ఎటువంటి ప్రాణనష్టంపై సమాచారం అందలేదని జపాన్‌ ఏరోస్పేస్‌ ఎక్స్‌ప్లొరేషన్‌ ఏజెన్సీ (జేఏఎక్స్‌ఏ) అధికారులు వెల్లడించారు. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టామన్నారు.


Post a Comment

0 Comments

Latest News

Powered by Blogger.

Admin

Admin
Content published by Samajika Spandana.