అమలాపురం, సామాజిక స్పందన :
వైకాపా మళ్లీ అధికారంలోకి వస్తే గోచీ కూడా మిగలదని తెదేపా అధినేత చంద్రబాబు ప్రజలను హెచ్చరించారు. పేదలను దోచుకునే ముఖ్యమంత్రి జగన్.. అధికారంలోకి రావడం కోసం తల్లి, చెల్లిని కూడా ఉపయోగించుకున్నారని ధ్వజమెత్తారు..
'భవిష్యత్తు గ్యారంటీ' యాత్రలో భాగంగా కోనసీమ జిల్లాలో మూడోరోజు చంద్రబాబు పర్యటించారు. ఈ సందర్భంగా అమలాపురంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వైకాపా పాలన తీరుపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.
''దేశంలోనే ధనిక సీఎం.. ఈ సైకో జగన్. ఆయన రాష్ట్రానికి పట్టిన క్యాన్సర్ గడ్డ. ఈ క్యాన్సర్ గడ్డను వదిలించుకోవాల్సిన అవసరం అందరిపై ఉంది. ప్రజలు ఏమారితే రాష్ట్రమే నాశనమైపోతుంది. వైకాపాను చిత్తుచిత్తుగా ఓడించాల్సిన అవసరం ఉంది. రాష్ట్రంలో ఇసుకాసురులు ఎక్కువయ్యారు. రుషికొండకూ గుండు కొట్టారు. తిరుమలలో పులులుంటే భక్తులకు కర్రలు ఇస్తామంటున్నారు. భక్తులు శ్రీవారిని చూడడానికి కాదు.. పులులను చంపడానికి వెళ్తున్నట్లుంది. కర్ర ఉంటే పులి పారిపోతుందా? ఇంటికో కర్ర పెట్టుకుని ముందుగా ఈ వైకాపా దొంగలను తరిమికొట్టాలి. అని విమర్శలు గుప్పించారు.
నిజాలు మాట్లాడితే పవన్‌పైనా విరుచుకుపడుతున్నారువిరుచుకుపడుతున్నారు అని అన్నారు.
కేసులు మాఫీ చేసే వారి కోసం ఎంపీ సీటును సీఎం జగన్ అమ్ముకున్నారు. కేంద్రం మెడలు వంచుతామని చెప్పి మెడలు దించారు. పోలవరం నిధుల కోసం ఎప్పుడైనా మాట్లాడారా? కడప స్టీల్ ప్లాంట్, రైల్వే జోన్ వచ్చిందా? పార్లమెంటులో ఒక్కసారైనా వైకాపా ఎంపీలు ప్రజా సమస్యలపై మాట్లాడారా? బాబాయ్ హత్య కేసులో తమ్ముడిని కాపాడేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారు. హత్యా రాజకీయాలు నాకు చేతకాదు.. అవి నా వారసత్వం కాదు. పవన్ నిజాలు మాట్లాడితే ఆయనపైనా విరుచుకుపడుతున్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ రాస్తే మీడియాపై దాడులు చేస్తున్నారు. ఎవరూ వాస్తవాలు మాట్లాడకూడదని జగన్ భావిస్తున్నారు. వైకాపాకు ఎక్స్‌పైరీ డేట్ వచ్చింది. జగన్ మాదిరిగా మోసం చేయను.. చెప్పిన పని చేస్తా'' అని చంద్రబాబు తెలిపారు..










0 Comments