విజయవాడ, సామాజిక స్పందన
ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిపై (CM JAGAN) టీడీపీ యువనేత నారా లోకేష్ (Nara Lokesh) విమర్శలు గుప్పించారు. "జగన్మోహన్ రెడ్డికి ముస్లింల ఆస్తులు, ఓట్లపై తప్ప వారి సంక్షేమంపై శ్రద్ధలేదు..
వేలకోట్ల రూపాయల వక్ఫ్ ఆస్తులను వైసీపీ దొంగలు అడ్డగోలుగా దోచుకున్నారు. మసీదు ఆస్తుల పరిరక్షణ కోసం పోరాడిన ఇబ్రహీంను నర్సరావుపేటలో దారుణంగా నరికిచంపారు. మైనారిటీ సబ్ ప్లాన్ నిధులు రూ.5,400 కోట్లను దారిమళ్లించి తీరని ద్రోహం చేశారు. అధికారంలోకి వచ్చాక గతంలో అమలుచేసిన మైనారిటీ సంక్షేమ పథకాలన్నీ పునరుద్దరిస్తాం. వక్ఫ్ బోర్డు ఆస్తుల పరిరక్షణకు పటిష్టమైన చర్యలు తీసుకుంటాం. దుల్హన్ పథకాన్ని ఎటువంటి కొర్రీలు లేకుండా పేద ముస్లింలందరికీ వర్తింపజేస్తాం. పేదముస్లింలకు ఆర్థిక చేయూతనందించేందుకు ఇస్లామిక్ బ్యాంకు ఏర్పాటు చేస్తాం. మసీదుల రిపేర్లు, షాదీఖానాల నిర్మాణానికి చర్యలు తీసుకుంటాం." అని లోకేష్ అన్నారు..
"టీడీపీ పాలనలో ప్రవేశపెట్టిన ముస్లిం సంక్షేమ పథకాలను వైసీపీ రద్దు చేసింది. విదేశీవిద్య, దుల్హన్ పథకాలను రద్దు చేశారు. విజయవాడలో రెండవ హజ్ హౌస్, ఇస్లామిక్ సెంటర్ నిర్మించాలి. మైనారిటీ కార్పొరేషన్ ద్వారా ఆర్థిక చేయూతనివ్వాలి. మసీదుల రిపేర్లు, షాదీఖానాల నిర్మాణాలు చేయాలి. మైనారిటీలకు 4శాతం రిజర్వేషన్ ను కొనసాగించాలి. రంజాన్ తోఫా, చంద్రన్న బీమా, దుకాన్-మకాన్ పథకాలు పునరుద్ధరించాలి. వక్ఫ్ బోర్డు ఆస్తులతోపాటు ముస్లింలకు రక్షణకు చర్యలు తీసుకోవాలి." అని లోకేష్‌ను ముస్లిం నేతలు కోరారు.
విజయవాడ తూర్పు నియోజకవర్గం డివి మేనర్ వద్ద ఎన్టీఆర్ జిల్లా ముస్లింలు యువనేత లోకేష్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు..
విజయవాడ తూర్పు నియోజకవర్గం డివి మేనర్ వద్ద ఎన్టీఆర్ జిల్లా ముస్లింలు యువనేత లోకేష్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు.
బెజవాడలో యువగళం పాదయాత్ర్ర జాతరను తలపిస్తోంది. విజయవాడ ఎ కన్వెన్షన్ సెంటర్ నుంచి యువనేత లోకేష్ పాదయాత్ర ప్రారంభమైంది. లోకేష్ కు సంఘీభావంగా భారీగా మహిళలు, యువతీయువకులు రోడ్లపైకి వచ్చారు. అడుగడుగునా లోకేష్ కు విజయవాడ ప్రజల ఆత్మీయ స్వాగతం పలికారు. తనను కలిసేందుకు వచ్చిన ప్రజలను లోకేష్ ఆప్యాయంగా పలకరిస్తూ సమస్యలు తెలుసుకుంటున్నారు..










0 Comments