బీహార్, పట్నా, సామాజిక స్పందన
ప్రతిపక్ష పార్టీల ఐక్యతతో ప్రధాని మోదీ , భాజపా లు ఆందోళనకు గురవుతున్నాయని విమర్శించారు..
ఎన్‌డీఏ భాగస్వామ్య పార్టీలు భయం వల్లనే ఆ కూటమిలో ఇంకా కొనసాగుతున్నాయని ఆరోపించారు. ''దేశాభివృద్ధి కోసమే మేమంతా చేతులు కలిపాం. ఇండియా కూటమిని చూస్తే భాజపాకు ఆందోళన కలుగుతోంది. ఎన్‌డీఏలో ఉన్న చాలా పార్టీలు భయం కారణంగానే ఆ కూటమిలో కొనసాగుతున్నాయి. ఎన్నికల సమయంలోనే భాజపాకు ఎన్‌డీఏ కూటమి పార్టీలు గుర్తొస్తాయి'' అని విమర్శించారు.
మణిపుర్ అంశం గురించి పార్లమెంట్‌లో ప్రధాని ప్రసంగంపై కూడా నీతీశ్ పరోక్ష విమర్శలు చేశారు. ''ఆందోళనలు నెలకొన్న ప్రాంతాల గురించి పార్లమెంట్‌లో ఎలాంటి ప్రకటన చేయలేదు. సభ జరుగుతుంటే ఆయన బయటే ఉండిపోయారు. ఇలా ఇంతకు ముందు ఎప్పుడైనా జరిగిందా? సభలో ప్రతిపక్షాలకు తమ అభిప్రాయాలను చెప్పే హక్కు ఉంది. కానీ, పార్లమెంట్‌లో అధికారపక్షం చెప్పేదే వెలుగులోకి వస్తుంది. ప్రతిపక్షాలు లేవనెత్తే విషయాలకు ప్రాధాన్యం ఇవ్వడంలేదు'' అని నీతీశ్ విమర్శించారు..










0 Comments