శంషాబాద్‌ విమానాశ్రయంలో రూ.4.86కోట్ల విలువైన బంగారం

  


హైదరాబాద్, సామాజిక స్పందన:

శంషాబాద్‌లోని రాజీవ్‌ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో అక్రమంగా పెద్ద ఎత్తున్న బంగారాన్ని తరలిస్తుండగా అధికారులు శనివారం స్వాధీనం చేసుకున్నారు.


ఎవరి కంటపడకుండా అక్రమంగా ఎనిమిది కిలోల బంగారాన్ని పలువురు వ్యక్తులు తరలిస్తుండగా కస్టమ్స్‌ అధికారులు చాకచక్యంగా పట్టుకున్నారు. పట్టుకున్న బంగారం విలువ రూ.4.86కోట్ల విలువ ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. నలుగురు వ్యక్తుల నుంచి ఈ బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు.


బ్యాంకాక్‌ నుంచి వచ్చిన ఇద్దరి నుంచి 3.78 కిలోల బంగారం, షార్జా నుంచి వచ్చిన వ్యక్తి నుంచి 2.17 కిలోలు, దుబాయి నుంచి వచ్చిన వ్యక్తి నుంచి 2.5 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు కస్టమ్స్‌ అధికారులు తెలిపారు.


సదరు వ్యక్తులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి...

Post a Comment

0 Comments

Latest News

Powered by Blogger.

Admin

Admin
Content published by Samajika Spandana.