అన్యాయంగా ఓట్లు తొలగిస్తే, ఎన్నికల కమిషన్ కి ఫిర్యాదు చేస్తాం: చిలువూరి సతీష్ రాజు


 కోనసీమ జిల్లా, రావులపాలెం, సామాజిక స్పందన :

రావులపాలెం మండలంలో, వెదిరేశ్వరం, కేతరాజు పల్లి గ్రామాలలో ఆ గ్రామాల్లో ఉంటున్నటువంటి ఓటర్లు ఫిర్యాదు చేయకపోయినా అధికార పార్టీ నాయకులు, తెలుగుదేశం పార్టీ సానుభూతిపరుల ఓట్లు తొలగించడానికి ప్రయత్నిస్తున్నారని సతీష్ రాజు అన్నారు. ఈ రెండు గ్రామాలతో పాటు మిగిలిన గ్రామాల్లో కూడా లిస్టు తయారుచేసి ఉన్నత అధికారుల మీద ఒత్తిడి తీసుకువచ్చి ఓట్లు తొలగించడానికి కుట్ర చేస్తున్నారని, కోనసీమ జిల్లా తెలుగు యువత అధ్యక్షులు చిలువూరి సతీష్ రాజు ధ్వజమెత్తారు.


  ఏ విధమైన గైడెన్స్ పాటించకుండా, 7 పారాలు పెట్టకుండా, ఓట్లు ఎంక్వైరీ పంపించడం, ఎంతవరకు న్యాయం అని ప్రశ్నించారు. ఓట్లు తొలగించడానికి ఎన్నికల కమిషన్ ఇచ్చిన గైడెన్స్ పాటించాలని, మీరు అధికార పార్టీ నాయకుల ఆదేశాలు పాటిస్తే మేము ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేస్తామని తాసిల్దార్ ప్రతిష్ రాజు అన్నారు. 104 బూత్ లో బ్రతికున్న వారిని చనిపోయినట్టు చూపించడం ఎంతవరకు కరెక్ట్ అని తాసిల్దార్ నీ ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు గుత్తుల పట్టాభిరామారావు, నియోజకవర్గ బీసీ సెల్ అధ్యక్షులు కాసా విజయసాగర్, వెదిరేశ్వరం ఎంపిటిసి గంట  సుబ్బారావు, సాధనాల శ్రీను, సిద్దిరెడ్డి శ్రీను, చిట్టూరి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. 

Post a Comment

0 Comments

Latest News

Powered by Blogger.

Admin

Admin
Content published by Samajika Spandana.