దిల్లీ, సామాజిక స్పందన
ఇండోనేషియా రాజధాని జకార్తాలో పర్యటన ముగించుకున్న ప్రధాని నరేంద్ర మోదీ దిల్లీకి చేరుకున్నారు. జకార్తాలో ఆసియాన్-భారత్ సదస్సులో పాల్గొని తిరిగి స్వదేశానికి వచ్చేశారు..
సెప్టెంబర్ 9, 10 తేదీల్లో దిల్లీ వేదికగా జరగనున్న జీ 20 శిఖరాగ్ర సదస్సు సన్నద్ధతపై కాసేపట్లో ప్రధాని నరేంద్ర మోదీ సమీక్షించనున్నట్టు సమాచారం. ఈ మేరకు దిల్లీలోని సుష్మాస్వరాజ్ భవన్‌లో కేంద్రమంత్రులతో సమావేశమై చర్చించనున్నట్టు తెలుస్తోంది. జీ20 సదస్సుకు విదేశీ ప్రతినిధుల రాక ఇప్పటికే మొదలుకావడంతో సందడి వాతావరణం నెలకొంది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, బ్రిటన్ ప్రధాని రిషి సునాక్, కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో తదితర దిగ్గజ నేతలంతా సెప్టెంబర్ 8న దిల్లీకి చేరుకోనున్న నేపథ్యంలో ముమ్మర ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటివరకు జరిగిన ఏర్పాట్లు, భద్రతా చర్యలు తదితర కీలక అంశాలపై ప్రధాని మోదీ సమీక్షించనున్నారు..










0 Comments