అమరావతి, సామాజిక స్పందన
బాలకృష్ణ ఏపీ సీఎం జగన్ మీద ఈ వ్యాఖ్యలు చేయడంతో మాజీ మంత్రి కొడాలి నాని తీవ్ర స్థాయిలో అనుచిత వ్యాఖ్యలు చేశారు. పురందేశ్వరి, చంద్రబాబు కలిసి ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడిచారని.. అందుకే ఆయన అరెస్టును పురందేశ్వరి ఖండిస్తున్నారని మంత్రి కొడాలి నాని అన్నారు. తలపై ఎవరిదో బొచ్చు పెట్టుకొని(విగ్) తిరుగుతున్న బాలకృష్ణ, ఇప్పుడైనా కనీసం బ్రెయిన్ అయినా వాడాలని అన్నారు. అంతేకాక 'బాలకృష్ణ బొచ్చు లెస్.. బ్రెయిన్ లెస్' అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు నుంచి ప్యాకేజీ తీసుకొనే పవన్.. ఆయనకు మద్దతుగా మాట్లాడటం సహజమే అని కూడా పేర్కొన్నారు. ఇక అంతకముందు చంద్రబాబు అరెస్ట్ పై కొడాలి నాని ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ ఇన్నాళ్లూ వ్యవస్థలను మేనేజ్ చేస్తూ వచ్చిన చంద్రబాబు పాపం పండింది అంటూ ఆయన ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. తన పోస్ట్ కింద కరప్షన్ కింగ్ సీబీఎన్, స్కామ్ స్టార్ చంద్రబాబు అనే హ్యాష్ ట్యాగ్లు కూడా జత చేశారు..










0 Comments