బాలయోగికి ఘణ నివాళులు: టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు సత్యానందరావు.


కోనసీమ జిల్లా, కొత్తపేట, సామాజిక స్పందన:

 కోనసీమ అభివృద్ధి ప్రదాత, లోక్‌సభ మాజీ స్పీకర్ స్వర్గీయ జియంసీ బాలయోగి గారి 72 వ జయంతి సందర్భంగా కోనసీమ జిల్లా, కొత్తపేట బస్టాండ్ సెంటర్ లో తెలుగుదేశం పార్టీ శ్రేణులతో కలసి నివాళులర్పించిన రాష్ట్ర తెలుగుదేశంపార్టీ ఉపాధ్యక్షులు, బండారు సత్యానందరావు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాలయోగి  ఆశయాలను భావితరాలకు అందించడమే  ఘనమైన నివాళని బండారు సత్యానందరావు అన్నారు. ఆయనతో తనకున్న అనుబంధాన్ని గుర్తు    చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో బండారు సత్యానందరావు తో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు బాలయోగి కి నివాళులు అర్పించారు.



@@@##### మరిన్ని వార్తలు చదవండి#####@@@


ఐటీ ఉద్యోగుల నిరసనల్లో తప్పేముంది అంటున్న రేవంత్‌రెడ్డి

హైదరాబాద్‌, సామాజిక స్పందన

 హైదరాబాద్‌ పదేళ్లపాటు తెలుగు రాష్ట్రాల ఉమ్మడి రాజధాని, ఏపీకి సంబంధించిన అంశంపై ఇక్కడ నిరసన జరపొద్దు అంటే ఎలా? అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు..

నిరసనలు చేయవద్దన్న కేటీఆర్‌ వ్యాఖ్యలు అర్థరహితమన్నారు. 

''చంద్రబాబు అరెస్టు ఏపీకి మాత్రమే సంబంధించింది కాదు. చంద్రబాబు దేశ నాయకుడు. ఆయన అరెస్టుపై తెలంగాణలో నిరసనలు తెలపడంలో తప్పేముంది. నిరసన తెలిపే వాళ్లంతా ఇక్కడి ఓటర్లే. నిరసనకారులను నియంత్రించడంలో అర్థం లేదు. నిరసన తెలిపే హక్కును ఎవరూ కాలరాయలేరు. ఏ పార్టీ వాళ్లైనా నిరసన తెలిపే హక్కు ఉంది. ఐటీ ఉద్యోగుల నిరసనల్లో తప్పేముంది? ఉద్యమ సమయంలో అమెరికాలోనూ నిరసనలు జరిగాయి. ఏం హక్కు ఉందని అమెరికాలో నిరసనలు చేశారు? ప్రతి సమస్యకు దిల్లీ జంతర్‌మంతర్‌ వద్ద ఆందోళన చేస్తున్నారు?ఏం హక్కు ఉందని దిల్లీలో నిరసనలు చేశారు?'' అని రేవంత్‌ ప్రశ్నించారు.


@@@@@  మరిన్ని వార్తలు చదవండి @@@@@


ఎమ్మెల్సీ కవితకు బిగ్‌ షాక్‌, విచారణకు రావాలని ఈడీ నోటీసులు.

ఢిల్లీ, సామాజిక స్పందన

ఢిల్లీ లిక్కర్‌ స్కాంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఢిల్లీ లిక్కర్‌ స్కాం కేసులో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) మరోసారి నోటీసులు జారీ చేసింది..

ఈ క్రమంలో రేపు(శుక్రవారం) విచారణకు రావాలని నోటీసులు పంపించింది. 

వివరాల ప్రకారం.. ఢిల్లీ లిక్కర్‌ స్కాం కేసులో మొదటి నుంచి ట్విస్టులు చోటుచేసుకుంటున్న విషయం తెలిసిందే. తాజాగా మరోసారి ఈడీ.. ఎమ్మెల్సీ కవితకు నోటీసులు పంపించింది. ఈ సందర్బంగా రేపే విచారణను రావాలని నోటీసుల్లో పేర్కొనడం గమనార్హం. అయితే, ఈ కేసులో అరుణ్‌ రామచంద్రపిళ్లై నిన్ననే(బుధవారం) అప్రూవర్‌గా మారారు. ఈ విషయంలో ఆయన ప్రత్యేక జడ్జి ఎదుట వాంగ్మూలం ఇవ్వగా దాన్ని ఈడీ అధికారులు రికార్డు చేసినట్లు సమాచారం. లిక్కర్‌ స్కాం​ కేసులో గత ఏడాది మార్చి 7న అరుణ్‌ రామచంద్ర పిళ్లైని ఈడీ అధికారులు అరెస్టు చేశారు. ఆయన నుంచి పలు అంశాలు రాబట్టారు..

ఈ విచారణ సమయంలోనే అరుణ్‌ రామచంద్ర పిళ్లై అప్రూవర్‌గా మారినట్లు దర్యాప్తు సంస్థ అధికారులు తెలిపారు. పిళ్లై వాంగ్మూలం ఆధారంగా విచారణకు రావాలంటూ కవితకు ఈడీ అధికారులు సమన్లు జారీ చేశారు. ఆమెను విచారించారు. ఈ ఏడాది మార్చి 11వ తేదీన ఈడీ ఎదుట కవిత విచారణకు హాజరయ్యే సమయంలో పిళ్లై తన నిర్ణయం మార్చుకున్నారు. ఈడీ అధికారులు తనపై ఒత్తిడి చేసి కవిత పేరు చెప్పించారంటూ ఢిల్లీ రౌస్‌ అవెన్యూలోని సీబీఐ ప్రత్యేక కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఆ పిటిషన్‌ విచారణ కొనసాగుతుండగానే తాజాగా ఆయన మరోసారి అప్రూవర్‌గా మారినట్లు తెలిసింది.

Post a Comment

0 Comments

Latest News

Powered by Blogger.

Admin

Admin
Content published by Samajika Spandana.