హైదరాబాద్, సామాజిక స్పందన :
పోలవరం బ్యాక్ వాటర్ విషయంలో తమ అభ్యంతరాలు, వినతులను పట్టించుకోవడం లేదని తెలంగాణ ప్రభుత్వం ఆక్షేపించింది. తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరుతూ కేంద్ర జల సంఘానికి లేఖ రాసింది..
సీడబ్ల్యూసీ ఛైర్మన్‌కు లేఖ రాసిన తెలంగాణ ఈఎన్‌సీ మురళీధర్.. పోలవరం బ్యాక్ వాటర్ కారణంగా రాష్ట్రంలోని 954 ఎకరాలు ముంపునకు గురవుతాయన్నారు. ఇతర ఇబ్బందులు ఉన్నాయన్న విషయాన్ని గతంలో పలుమార్లు పేర్కొన్నట్లు తెలిపారు.
తాము లేవనెత్తిన తొమ్మిది అంశాల్లో ఒక్కదానిపై చర్య తీసుకోలేదని తెలిపారు. ఇప్పటివరకు ఏపీ ప్రభుత్వం ఎటువంటి చర్యలు చేపట్టడం లేదని, పీపీఏ నుంచి సమన్వయ లోపం ఉందని లేఖలో పేర్కొన్నారు. సుప్రీంకోర్టుకు కేంద్రం నివేదించినట్లు క్షేత్రస్థాయిలో చర్యలు తీసుకోవడం లేదన్నారు. సీడబ్ల్యూసీ, పీపీఏ సమావేశాల్లో ఇచ్చిన హామీలు కంటితుడుపుగానే మిగిలిపోయాయని పేర్కొన్నారు. తక్షణమే తమ అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకొని తగిన చర్యలు చేపట్టాలని కేంద్ర జలసంఘాన్ని తెలంగాణ ప్రభుత్వం కోరింది..
@@@@@@ మరిన్ని వార్తలు చదవండి@@@@@@
ప్రధానికి ఛాయ్ ఇచ్చిన రోబో.. ఫొటో మిస్ అవ్వొద్దన్న మోదీ
అహ్మదాబాద్, సామాజిక స్పందన
ప్రధానమంత్రి నరేంద్రమోదీ (PM Modi) తన సొంత రాష్ట్రం గుజరాత్ (Gujarat)లో పర్యటిస్తున్నారు. 'వైబ్రంట్ గుజరాత్ సమ్మిట్' 20వ వార్షికోత్సవం సందర్భంగా అహ్మదాబాద్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రధాని పాల్గొన్నారు..
ఈ కార్యక్రమ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన రోబోటిక్స్ గ్యాలరీ (Robotics Gallery)ని ఆయన వీక్షించారు. ఈ సందర్భంగా ఆ గ్యాలరీలో ప్రదర్శించిన ఓ రోబో మోదీకి ఛాయ్ (Chai) ఇచ్చింది.
ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను ప్రధాని సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు. ''గుజరాత్ సైన్స్ సిటీలో రోబోటిక్స్ గ్యాలరీ ఎంతగానో ఆకట్టుకుంది. రోబో మాకు ఛాయ్ ఇచ్చిన ఫొటోను మిస్ అవ్వొద్దు'' అని మోదీ ఆ ఫొటోలను క్యాప్షన్ ఇచ్చారు. ఈ గ్యాలరీలో అధునాతన రోబోలను ఆసక్తిగా తిలకించిన ప్రధాని.. వాటిని తన ఫోన్లో ఫొటోలు తీసుకున్నారు..
.jpg)










0 Comments