మంగళగిరి, సామాజిక స్పందన
రాష్ట్రాన్ని నడిపించే ఐఏఎస్ అధికారులకు 20వ తేదీ వరకు జీతాలు చెల్లించకపోవడం దారుణమని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. ఐఏఎస్‌లకు జీతాలు ఇవ్వలేని స్థితిలో ఏపీప్రభుత్వం ఉందని ఎద్దేవా చేశారు..
మంగళగిరిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పవన్ కల్యాణ్ మాట్లాడారు. '' వేతనాలు రాక ఒప్పంద ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారు. కన్సాలిడేటెడ్ ఫండ్ ద్వారా ఐఏఎస్‌లకు జీతాలు వస్తాయి. ఐఏఎస్‌ల జీతాలు మళ్లించారు. ఇది రాజ్యాంగ ఉల్లంఘనే. రాజ్యాంగ ఉల్లంఘన వైకాపా నేతలకు సహజ గుణంగా మారింది. అసమర్థ ప్రభుత్వ పాలనతో సమస్యలు లేవనెత్తితే దాడులు చేస్తున్నారు. సమస్యలు లేవనెత్తినా ప్రభుత్వానికి జవాబుదారీతనం లేదు. కేసులు వాయిదా వేయించుకోవడానికి సీఎం జగన్, ఎంపీలు దిల్లీకి వెళ్తున్నారా? వైకాపా అరాచకాలకు చరమగీతం పాడాల్సిన అవసరం ఉంది.'' అని పవన్ కల్యాణ్ అన్నారు..
కొల్లేరు నీటి సమస్య చాలా బాధ కలిగించిందని పవన్‌కల్యాణ్ తెలిపారు. కైకలూరు, ఉండవల్లి, ముదినేపల్లిలో నీటి సమస్య తీవ్రంగా ఉందన్నారు. కొల్లేరు సరస్సులో 17వేల టన్నుల వ్యర్థాలు చేరుతున్నాయని చెప్పారు. ప్రభుత్వాలు మారినప్పుడల్లా కాంటూరు పరిస్థితిమారుతోందని, కొల్లేరు సరస్సుకు సంబంధించి చాలా ఆక్రమణలు ఉన్నాయని పవన్ తెలిపారు. పొత్తులపై ఎవరికీ చెప్పాల్సిన పని లేదని, నేరుగా ప్రజలకే చెబుతామని అన్నారు. ఎక్కడి నుంచి పోటీ చేయాలనేది స్వీయ నిర్ణయం మేరకు ఉంటుందని చెప్పారు..
వైకాపా వ్యతిరేక ఓటు చీలకూడదు..
భాజపాతో పొత్తు పోయిందని వైకాపా నేతలు ఆరోపిస్తున్నారని పవన్ అన్నారు. అయితే, పొత్తులపై ఎవరికీ చెప్పాల్సిన పని లేదని.. ప్రజలకే చెబుతామని అన్నారు. ఎక్కడ పోటీ చేయాలనేది తమ స్వీయ నిర్ణయమని స్పష్టం చేశారు. జనసేనపై ఆరోపణలు చేయడం కాకుండా ఉద్యోగుల జీతాల కోసం దిల్లీకి వెళ్లాల్సిందన్నారు. ''తెలంగాణ ప్రజల ఆకాంక్ష.. పసుపు బోర్డు కలను కేంద్ర ప్రభుత్వం సాకారం చేసింది. సీఎం జగన్ దిల్లీ వెళ్లినా జీడిపప్పు, కొబ్బరి బోర్డుల కోసం కృషి చేయలేదు. పొత్తులు, సీట్లపై కంటే దిల్లీకి వెళ్లి రాష్ట్రానికి బోర్డులు తీసుకురావడంపై దృష్టిపెట్టాల్సింది. సీబీఐ కేసులు వాయిదా వేయించుకోవడానికి దిల్లీ వెళ్తున్నారు. ఎన్డీయేతో పొత్తులోనే ఉన్నాం.. ఎన్డీయే భేటీకి హాజరయ్యాం కూడా. 2024 ఎన్నికల్లో తెదేపా, జనసే, భాజపా కలిసి వెళ్లాలి. వైకాపా వ్యతిరేక ఓటు చీలకూడదనేదే నా ఆకాంక్ష'' అని పవన్ అన్నారు..
@@@@@ మరిన్ని వార్తలు చదవండి @@@@@
మొన్న చంద్రుడు, నిన్న సూర్యుడు, ఇవాళ శుక్రగ్రహంపై ప్రయోగాలకు ఇస్రో రెడీ.
మొన్నటి చంద్రుడి దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టిన తొలిదేశంగా భారత్ ప్రఖ్యాతి గాంచింది. నిన్న సూర్యుడి గుట్టు తెలుసుకునేందుకు ఆదిత్య మిషన్ ఎల్1 ను నింగిలోకి పంపింది..
ఇక ఇప్పుడు శుక్ర గ్రహంపై పరిశోధనలు చేసేందుకు భారత అంతరిక్ష సంస్థ (ఇస్రో) రంగం సిద్ధం చేస్తోంది.. చంద్రయాన్-3, ఆదిత్య ఎల్1 మిషన్ విజయవంతమైన నేపథ్యంలో త్వరలోనే వీనస్ మిషన్‌ను చేపట్టనుంది.
సౌర వ్యవస్థలో అత్యంత ప్రకాశవంతమైన గ్రహం అయిన శుక్రుడిపై భారత్ ప్రయోగాలు చేపట్టనుంది. ఇప్పటికే వీనస్ మిషన్‌కు సంబంధించి రెండు పేలోడ్లు అభివృద్ధి చేసినట్లు ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ తెలిపారు. శుక్రుడిపై అధ్యయనం చేయడం వల్ల అంతరిక్ష శాస్త్ర రంగంలోని అనేక ప్రశ్నలకు సమాధానాలు లభిస్తాయని చెప్పారు. శుక్రగ్రహం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందని.. అక్కడి వాతావరణం చాలా మందంగా ఉంటుందని వెల్లడించారు. భూమి కూడా ఏదో ఒకరోజు శుక్రుడు కావచ్చని .. 10,000 సంవత్సరాల తర్వాత భూమి లక్షణాలు మారిపోవచ్చని సోమనాథ్ పేర్కొన్నారు..











0 Comments