హైదరాబాద్, సామాజిక స్పందన.
మహిళా రిజర్వేషన్ బిల్లుపై రాష్ట్రపతి సంతకం చేయడం ఆనందంగా ఉందని తెలంగాణ గవర్నర్ తమిళిసై అన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లుపై రాజ్‌భవన్‌లో గవర్నర్ కృతజ్ఞత సభ ఏర్పాటుచేశారు..
ఈ సందర్భంగా తమకు 33 శాతం రిజర్వేషన్ కల్పించిన ప్రధాని మోదీకి ఆమె ధన్యవాదాలు తెలిపారు.
'' ఒకప్పుడు నేను భాజపా నేతను.. ఇప్పుడు గవర్నర్‌ను. రాజకీయాలపై ఇష్టం వల్లే వైద్య వృత్తికి దూరంగా ఉన్నా. రాజకీయాల్లో పురుషాధిక్యత ఎక్కువ. నేను గవర్నర్‌గా వచ్చినప్పుడు ఒక్క మహిళా మంత్రి కూడా లేరు. గవర్నర్‌గా వచ్చే నాటికి ఇద్దరు మహిళలు మంత్రులు అయ్యారు. నాపై పువ్వులు వేసే వారు ఉన్నారు.. రాళ్లు వేసే వారున్నారు. నాపై రాళ్లు వేస్తే.. వాటితో భవంతి కడతా. నాపై పిన్స్ వేస్తే.. ఆ పిన్స్ గుచ్చుకుని వచ్చే రక్తంతో నా చరిత్ర బుక్ రాసుకుంటా. అందరూ అందరికీ నచ్చాలని లేదు. నాపై పువ్వులు వేసినా.. రాళ్లు వేసినా ఆహ్వానిస్తా. మంచి పనులు చేయడానికి అధికారం ఉండాలి. ఎలాంటి అవమానాలు పట్టించుకోను.. ప్రజల కోసం పనిచేస్తా'' అని గవర్నర్ వెల్లడించారు..










0 Comments