తెలంగాణ ,సామాజిక స్పందన ;
ఓటుకు నోటు కేసులో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి చుక్కెదురైంది. సుప్రీంకోర్టులో ఆయన వేసిన పిటిషను ధర్మాసనం డిస్మిస్ చేసింది. కాగా 2015 ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో నామినేటెడ్ ఎమ్మెల్సీ స్టీఫెన్సన్కు డబ్బులిచ్చారని రేవంత్ రెడ్డిపై అభియోగాలున్నాయి. అయితే ఈ కేసుకు అవినీతి నిరోధక చట్టం వర్తించదని కేసు కొట్టివేయాలంటూ రేవంత్ సుప్రీంను ఆశ్రయించారు.
@@@@ మరిన్ని వార్తలు చదవండి @@@@
తెలంగాణకు ప్రధాని మోదీ వరాలు : సమ్మక్క-సారలమ్మ పేరుతో యూనివర్సిటీ.
తెలంగాణ, మహబూబ్‌నగర్, సామాజిక స్పందన
ప్రధాని మోదీ ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా పర్యటనలో ఉన్నారు. ఈ సందర్బంగా పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ క్రమంలో తెలంగాణ ప్రజలకు పలు వరాలను ప్రకటించారు. తెలంగాణలో పసుపు బోర్డు, సమక్క సారక్క పేరుతో సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీని ఏర్పాటు చేయబోతున్నట్టు స్పష్టం చేశారు.
కాగా, ప్రధాని మోదీ మాట్లాడుతూ.. నా కుటుంబ సభ్యులారా చాలా సంతోషంగా ఉంది అని తెలుగులో మాట్లాడారు. పలుమార్లు నా కుటుంబ సభ్యులారా అని ప్రసంగించారు. ఈ క్రమంలోనే కీలక ప్రకటనలు చేశారు. తెలంగాణ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉంది. పాలమూరు సభ సాక్షిగా రాష్ట్రంలో పసుపు రైతుల కోసం నేషనల్ టర్మరిక్ బోర్డు ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. పసుపు రైతుల సంక్షేమం కోసం జాతీయ పసుపు బోర్డు చేస్తున్నామన్నారు. తెలంగాణలో పసుపు పంట విస్తృతంగా పండుతోంది. పసుపు రైతుల సంక్షేమానికి కేంద్రం కట్టుబడి ఉంది.
ఇదే సమయంలో ములుగు జిల్లాలో సమక్క సారక్క పేరుతో సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తున్నట్టు స్పష్టం చేశారు.












0 Comments