కాకినాడ జిల్లా, పెద్దాపురం, సామాజిక స్పందన :
పెద్దాపురం నియెాజకవర్గంలో హౌసింగ్ కార్పోరేయన్ ఛైర్మెన్ ఉన్నా ఏటుపట్టులోని 11 గ్రామాలలోని ఇళ్ళ పరిస్దితి చాలా దారుణంగా ఉందని సిపిఎం ఆధ్వర్యంలో చంద్రమాంపల్లి (దివిలి) సెంటర్‌లో ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాకు తెలుగుదేశం, జనసేన పార్టీలు మద్దతు తెలియజేసాయి. సిపిఎం రూరల్ కార్యదర్శి కేదారి నాగు అధ్యక్షతన జరిగిన ధర్నాలో సిపిఎం మండల కార్యదర్శి నీలపాల సూరిబాబు మాట్లాడుతూ రామేశంపేట మెట్టలో 11 గ్రామాలకు ఇచ్చిన 1980 ఇళ్ళ స్ధలాల కేటాయించిన ప్రాంతం సమస్యలపై తహశీల్దారు ని కలిసినప్పుడు ఇక్కడంతా సిద్దమని చెప్పారని అసలు అధికారులు అక్కడ పరిశీలించారా అని ప్రశ్నించారు. బండరాళ్ళ మధ్యలో స్ధలలా మార్కులు, రాళ్ళు వేసారని అది అధికారులకు కనిపించలేదా అని అడిగారు. అన్ని ప్రాంతాల్లో స్ధానికంగా స్ధలాలు కొని ఇళ్ళ స్ధలాలకు కేటాయించారని కానీ పెద్దాపురం మండలంలో మాత్రం 18 కిలోమీటర్లు దూరంలో కేటాయించారని అన్నారు. ఇళ్ళస్థలాలు వదులుకోలేక, అక్కడ ఎలా వెళ్లాలో అర్దం కాని పరిస్ధితిలో 11 గ్రామాల ప్రజలు ఉన్నారని తెలిపారు. తాటిపర్తిలో హౌసింగ్ కార్పోరేషన్ ఛైర్మెన్ ఓటు వేస్తారని కానీ అలాంటి ఏటి పట్టు గ్రామాలు మాత్రం పట్టవా అన్నారు. వీరికి ఉపాధి ఎలా అనేది ఎవ్నరూ ఆలోచించలేదన్నారు. వైసిపి నాయకులకు ఏటిపట్టు గ్రామాలపై ఎందుకంత కక్ష అని ప్రశ్నించారు. 5వ తేదీ ముఖ్య మంత్రి పర్యటనలో ఈ సమస్యను అధికారులు, వైసిపి నాయకులు ప్రస్తావించాలని, లేని పక్షంలో తామే ఆ పని చేస్తామని హెచ్చరించారు. తెలుగుదేశం మండల అధ్యక్షులు కొత్తెం శ్రీనివాసరావు (కోటి), జనసేన మండల ప్రచార కార్యదర్శి కంటిబోయిన ప్రసాద్ లు మాట్లాడుతూ ఇళ్ళస్ధలాల సమస్యపై ప్రజలను కదిలించి ఆందోళన నిర్వహిస్తామని తెలిపారు. ఇళ్ళస్ధలాలు ఇవ్వడమంటే ఎక్కడకో పడేయడం కాదనే విషయాన్ని గుర్తించాలని తెలిపారు. అధికారులు మరోసారి పరిశీలించాలని, స్ధలాలు ఊరు దగ్గరిలోనే కొనుగోలు చేసి ఇస్తే ఉపయెాగమని తెలిపారు.
సిపిఎం నాయకులు సిరిపురపు శ్రీనివాస్, పెంటయ్య, మాగాపు నాగు, మంతెన సత్తిబాబు, పాపేశ్వరరావు, తెలుగుదేశం పార్టీ నాయకులు మొయిల కృష్ణమూర్తి, తుమ్మల నాని, రేలంగి బుజ్జి, ఎగ్గాడ శ్రీను, రేలంగి వెంకట్రావు, రామ్ కోటి, జనసేన నాయకులు వెన్నా వెంకటేష్, కంటిబోయిన కొండలరావు, బత్తుల శ్రీనివాస్, సాలిపిల్లి వెంకన్న, కొట్టు సత్తిబాబు, దాట్ట విజయ్ బాబు, కొమ్మిరెడ్డి బాబ్జి తదితరులు పాల్గోన్నారు.










0 Comments