
కాకినాడ జిల్లా, పెద్దాపురం, సామాజిక స్పందన
ఏటిపట్టు గ్రామాల అభివృద్దికి వైసిపి ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని సిపిఎం విమర్శించింది. ప్రజారక్షణ భేరి యాత్రలో భాగంగా 3వ రోజు జి.రాగంపేట, వడ్లమూరు, గోరింట, పులిమేరు, దివిలి, చంద్రమాంపల్లి, తాటిపర్తి, చెదలాడ, తిరుపతి, మర్లావ, కాండ్రకోట, గుడివాడ, సిరివాడ మీదుగా పెద్దాపురం చేరుకుంది. ఈ సందర్బంగా అన్ని గ్రామాల్లోనూ సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్బంగా బెల్లం తయారీ కేెంద్రాలను, జగనన్న కాలనీలను సందర్శించారు. ఈ సందర్బంగా సిపిఎం రూరల్ కార్యదర్శి కేదారి నాగు, మండల కార్యదర్శి నీలపాల సూరిబాబు లు ప్రసంగించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ కేంద్రంలో బిజెపి ప్రభుత్వం ప్రజలపైన భారాలు మెాపుతుంటే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం మరింత భారం మెాపుతుందన్నారు. విద్యుత్ చార్జీలు, చెత్తపన్ను, ఆస్దిపన్ను పెంపుదలతో ప్రజల నడ్డి విరుస్తుందన్నారు. ప్రజాప్రణాళికతో సిపిఎం వాడావాడల ప్రచారం నిర్వహిస్తుందని రాజకీయ ఎజెండాగా ప్రజల సమస్యలను తీసుకురావడమే ముఖ్య లక్ష్యమని అన్నారు. ఏటిపట్టున ఉన్న 11 గ్రామాల ఇళ్ళ స్ధలాల సమస్య నేటికి పరిష్కారం కాలేదని అన్నారు. చెరకు రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని, బెల్లం రైతులకు న్యాయం చేసి ప్రభుత్వం సబ్సిడీలు అందజేయాలని డిమాండ్ చేసారు.
ప్రచార జాతాలో సిపిఎం నాయకులు పెంటయ్య, సత్యనారాయణ, అప్పన్న, నరసింహమూర్తి, కృష్ణ సిరిపురపు శ్రీనివాస్, మంతెన సత్తిబాబు, సిరిపురపు మరిడియ్య, యాసలపు రమేష్, జగదీష్, క్రాంతి కుమార్ తదితరులు పాల్గోన్నారు.
@@@@@@@ మరిన్ని వార్తలు చదవండి@@@@@@@
కాకినాడ జిల్లా పెద్దాపురంలో విద్యార్థులకు భౌతిక మరియు రసాయన శాస్త్ర ప్రయోగాల వర్క్ షాప్.
కాకినాడ జిల్లా, పెద్దాపురం, సామాజిక స్పందన
పెద్దాపురం స్థానిక రామారావు పేట లో ఏర్పాటుచేసిన ACT SCIENCE సెంటర్ లో 29-10-23 వివిధ పాఠశాల 10వ తరగతి విద్యార్థులకు భౌతిక రసాయన శాస్త్ర ప్రయోగాల వర్క్ షాప్ నిర్వహించారు. ఈ వర్క్ షాప్ కు 100 మంది విద్యార్థులు హాజరయ్యారని సైన్స్ సెంటర్ నిర్వాహకులు బుద్ధా శ్రీనివాస్ చెప్పారు. విన్నదానికంటే, చదివిన దానికంటే , చేసింది బాగా అర్థమవుతుందని ఈ వర్క్ షాప్ కు రిసోర్స్ పర్సన్స్ గా వ్యవహరించిన రేవతి సైన్స్ ఫౌండేషన్ రామచంద్రపురం శ్రీకృష్ణ సాయి మరియు బుద్ధ శ్రీనివాస్ అన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. పాఠ్యాంశాల్లో చదివిన అంశాలను ప్రయోగాలు చేయడం ద్వారా చాలా బాగా అర్థమైందని విద్యార్థుల అభిప్రాయపడ్డారు...
సిఎం జగన్మోహన్ రెడ్డికి పెద్దాపురం సిపిఎం నాయకులు రాసిన బహిరంగ లేఖ.
కాకినాడ జిల్లా, పెద్దాపురం, సామాజిక స్పందన
పెద్దాపురం నియెాజకవర్గానికి ముఖ్యమంత్రి జగన్ మెాహన్ రెడ్డి ప్రతిపక్షనాయకుని హోదాలో ఇచ్చిన హామీల సంగతేమిటని సిపిఎం ప్రశ్నించింది.
ఈ మేరకు ముఖ్యమంత్రి జగన్ మెాహన్ రెడ్డికి బహిరంగ లేఖను విడుదల చేసారు. సిపిఎం పెద్దాపురం మండల కార్యదర్శి నీలపాల సూరిబాబు అధ్యక్షతన జరిగిన సమావేశంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు కరణం ప్రసాదరావు బహిరంగ లేఖను విడుదల చేసారు. 2018 జూలై 18వ తేదీన ప్రతిపక్ష నాయకుని హోదాలో పెద్దాపురం మెయిన్ రోడ్ లో నిర్వహించిన సభలో ఏమి మాట్లాడారో ఒకసారి ముఖ్యమంత్రి గుర్తు చేసుకోవాలన్నారు. అధికారంలోకి వచ్చి నాలుగున్నర సంవత్సరాలు అయినా ఒక్క హామీ కూడా పూర్తి చేయ్యలేదని తెలిపారు. పెద్దాపురం, సామర్లకోటకు గొదావరి మంచినీటిని అందిస్తామని దవళేశ్వరం నుండి పైప్ లైన్ వేస్తామన్న హామీ ఎక్కడికు పోయిందని ప్రస్నించారు. 100 పడకల హాస్పటల్ అని డబ్బాకొట్టి కనీసం దాని ఊసు ఎత్తలేదన్నారు. ఉపాది కల్పన కోసం మాట్లాడిన జగన్ మెాహన్ రెడ్డికి షుగర్ ప్యాక్టరీ మూసేసినా, శాగో ప్యాక్టరీలు మూతపడినా పట్టించుకోలేదన్నారు. టిట్కో ఇళ్ళ సమస్య పరిష్కారం కాలేదని తెలిపారు. అందరికీ ఇళ్ళ ప్రారంభం కోసం వస్తున్న జగన్ కి ఏటిపట్టు 11 గ్రామాలకు ఇళ్ళ స్ధలాల సమస్య కనపడలేదా అని ప్పశ్నించారు. ఫ్యాక్టరీలో వ్యర్దాలు కలుషితం అయిపోతున్నాయని లేఖలో తెలిపారు. రామేశంపేట మెట్టను వైసిపి నాయకులు తవ్వుకుపోతుంటే మీ హామి ఏమైపోయిందని ప్రస్నించారు.
సమస్యల పరిష్కారంకు చొరవచూపాలని డిమాండ్ చేసారు. బహిరంగ లేఖను పెద్దాపురం నియెాజకవర్గానికి వస్తున్న ముఖ్యమంత్రికి ప్రజల ద్వారా అందిస్తామని తెలిపారు.
కార్యక్రమంలో సిరపురపు శ్రీనివాస్, కేదారి నాగు, గడిగట్ల సత్తిబాబు, మహపాతిన రాంబాబు, రొంగల వీర్రాజు, కూనిరెడ్డి అప్పన్న, దారపురెడ్డి కృష్ణ తదితరులు పాల్గోన్నారు.
0 Comments