హైదరాబాద్, సామాజిక స్పందన
తెలంగాణ రాష్ట్ర దళితులకు ఊహించని షాక్ తగిలింది. దళిత బంధు పథకాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది..
ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సంగతి తెలిసిందే. ఎన్నికల కోడ్ అమలులోకి రావడంతో సంక్షేమ పథకాలు అన్నిటికీ బ్రేక్ పడింది. దళిత బంధు పథకాన్ని తాత్కాలికంగా నిలిపి వేస్తున్నట్లు ములుగు జిల్లాలోని ఎస్సీ కార్పొరేషన్ ఆఫీస్ వద్ద ఒక బోర్డు పెట్టారు. గమనిక పేరుతో ఎన్నికల నియామవళి 2023 అమలులో ఉన్నందున దళిత బంధువు మరియు ఇతర పథకాలు తాత్కాలికంగా నిలిపివేయడమైనది అని రాసి ఉంది. ఇక అది చూసిన ప్రజలు నిరాశతో వెను తిరుగుతున్నారు..
@@@@@@ మరిన్ని వార్తలు చదవండి @@@@@@
అక్టోబర్ 15న హుస్నాబాద్ బహిరంగ సభలో బీఆర్ఎస్ పార్టీ మానిఫెస్టో ప్రకటించనున్న కేసీఆర్
తెలంగాణ , సామాజిక స్పందన :
అక్టోబర్ 15వ తేదీన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులతో, తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ అధినేత ముఖ్యమంత్రి కేసీఆర్ సమావేశం
.. అదేరోజు అభ్యర్థులకు బీ ఫారాలను అందించి పార్టీ మేనిఫెస్టో విడుదల
నవంబర్ 9న రెండు చోట్ల నామినేషన్ వేయనున్న కేసీఆర్
అక్టోబర్ 15, 16, 17, 18 తేదీల్లో జిల్లాలు, నియోజకవర్గాల పర్యటన.
అక్టోబర్ 15న హైద్రాబాద్ నుంచి బయలుదేరి., హుస్నాబాద్ నియోజకవర్గ కేంద్రంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సాయంత్రం 4 గంటలకు సీఎం కేసీఆర్ పాల్గొంటారు.
తెల్లారి...అక్టోబర్ 16 నాడు జనగామ, భువనగిరి నియోజకవర్గాల కేంద్రాల్లో బహిరంగ సభలో సిఎం పాల్గొంటారు.
17న సిద్దిపేట, సిరిసిల్ల నియోజకవర్గ కేంద్రాల్లో నిర్వహించే బహిరంగ సభలో సిఎం కేసీఆర్ గారు పాల్గొంటారు.
అక్టోబర్ 18 నాడు.. మధ్యాహ్నం 2 గంటలకు జడ్చర్ల నియోజకవర్గ కేంద్రం లో., అదే రోజు సాయంత్రం 4 గంటలకు మేడ్చల్ నియోజకవర్గ కేంద్రంలో నిర్వహించే బహిరంగ సభల్లో సిఎం పాల్గొంటారు.

.jpg)









0 Comments